E-Paper
Advertisement

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!
Advertisement

Monsoon Fridge Tips: మన ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులలో ఫ్రిజ్ అనేది 24 గంటలూ పనిచేసే ఏకైక గార్జెట్. ముఖ్యంగా ఫ్రిజ్ కూలింగ్ ఎక్కువగా అవసరమవుతుంది కాబట్టి మనం టెంపరేచర్‌ను తక్కువలో సెట్ చేస్తాం. కానీ వర్షాకాలం, చలికాలంలో వాతావరణమే సహజంగా చల్లగా ఉంటుంది. కాబట్టి అదే టెంపరేచర్‌ను వర్షాకాలంలో కూడా కొనసాగిస్తే.. ఫ్రిజ్ మోటార్‌పై భారం పడి కరెంట్ బిల్లు తడిసిమోపెడవుతుంది. అంతే కాకుండా గాలిలో తేమ ఎక్కువగా.. ఉండటం వల్ల ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. వర్షాకాలంలో ఫ్రిజ్‌ను ఏ విధంగా ఉపయోగించాలి. ఎంత టెంపరేచర్‌లో ఉంచితే కరెంబ్ బిల్లు తక్కువగా వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. ఫ్రిజ్ టెంపరేచర్ :

సాధారణంగా సమ్మర్‌లో ఫ్రిజ్ కంపార్ట్‌మెంట్‌ను 2 లేదా 3 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేస్తాము. కానీ వర్షా కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి.. ఫ్రిజ్ టెంపరేచర్‌ను 4 డిగ్రీల నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్యలో సెట్ చేయడం మంచిది. అలాగే ఫ్రీజర్ భాగాన్ని సాధారణంగా ఉండే -18 డిగ్రీల వద్దే ఉంచవచ్చు. ఈ మోడరేట్ టెంపరేచర్ వల్ల ఆహారం తాజాగా ఉండటమే కాకుండా.. కరెంట్ బిల్లు కూడా చాలా వరకు తగ్గుతుంది.

2. ఫుడ్ స్టోరేజ్:

Advertisement

వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ కారణంగా కూరగాయలు, పండ్లు త్వరగా కుళ్లిపోవడం లేదా జిగటగా మారుతుంటాయి. దీని కోసం ఫ్రిజ్‌లో పెట్టే ఆహార పదార్థాలను ఎప్పుడూ గాలిచొరబడని కంటైనర్లు లేదా జిప్ లాక్ కవర్లలో స్టోర్ చేయాలి. వేడి వేడిగా ఉన్న పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకండి. అది ఫ్రిజ్ ఇన్‌టర్నల్ టెంపరేచర్‌ను దెబ్బతీసి ఎక్కువ కరెంట్ బిల్లు రావడానికి దారితీస్తుంది.

3. ఫ్రిజ్ డోర్ సీలింగ్:

వర్షాకాలంలో ఫ్రిజ్ డోర్ రబ్బరు గ్యాస్కెట్ సరిగ్గా క్లోజ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి.గ్యాస్కెట్ పాడైపోయి గాలి లోపలికి వెళ్తే, ఫ్రిజ్ లోపల కూలింగ్ తగ్గిపోయి మోటార్ నిరంతరం రన్ అవుతుంది. దీని వల్ల కరెంట్ బిల్లు అకస్మాత్తుగా పెరిగిపోతుంది. డోర్ సరిగ్గా లాక్ అయ్యేలా చూసుకోవడం వల్ల కరెంట్ ఆదా అవుతుంది.

Advertisement

Also Read: ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!

4. పవర్ కట్స్ :

వర్షా కాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల వల్ల తరచుగా కరెంట్ పోతుంటుంది. కాబట్టి వోల్టేజ్ అప్‌డౌన్స్ వస్తుంటాయి. ఈ పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఫ్రిజ్ కంప్రెసర్ కాలిపోయే ప్రమాదం ఉంది. దీనికో సం మంచి క్వాలిటీ ఉన్న వోల్టేజ్ స్టెబిలైజర్‌ను వాడటం చాలా ముఖ్యం. అలాగే కరెంట్ పోయినప్పుడు ఫ్రిజ్ డోర్‌ను పదే పదే తెరవకపోతే లోపలి చల్లదనం ఎక్కువ సేపు ఉంటుంది.

5.రెగ్యులర్ డీఫ్రాస్టింగ్ & క్లీనింగ్:

మీది డైరెక్ట్ కూల్ ఫ్రిజ్ అయితే.. వర్షాకాలంలో ఫ్రీజర్‌లో గడ్డకట్టే ఐస్ లేయర్‌ను ఎప్పటికప్పుడు డీఫ్రాస్ట్ చేయాలి. ఐస్ ఎక్కువగా పేరుకుపోతే కూలింగ్ సరిగ్గా రాక కంప్రెసర్‌పై భారం పడుతుంది. అలాగే ఫ్రిజ్ లోపలి భాగాలను నిమ్మరసం లేదా వెనిగర్‌తో శుభ్రం చేయడం వల్ల వర్షాకాలంలో వచ్చే చెడు వాసన, బ్యాక్టీరియా నుంచి దూరంగా ఉండొచ్చు.

వర్షాకాలంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా.. మన ఫ్రిజ్‌ను ఎక్కువ రోజులు పాడవకుండా కాపాడుకోవచ్చు. సరైన ఉష్ణోగ్రతను (4 నుంచి 5 డిగ్రీలు) సెట్ చేయడం వల్ల కరెంట్ బిల్లును  ఆదా చేయడమే కాకుండా.. మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

Related News

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే.. 99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

Big Stories

Advertisement
×