E-Paper
Advertisement

తెలంగాణలో రాజకీయ పార్టీలకు కొత్త టెన్షన్.. 63 లక్షల ఓట్లుపై వేటు, హైదరాబాద్‌ మాటేంటి?

తెలంగాణలో రాజకీయ పార్టీలకు కొత్త టెన్షన్.. 63 లక్షల ఓట్లుపై వేటు, హైదరాబాద్‌ మాటేంటి?
Advertisement

Hyderabad: తెలంగాణలో రాజకీయ పార్టీలకు కొత్త టెన్షన్ పట్టుకుందా? తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 63 లక్షల ఓట్లు గల్లంతు కానున్నాయా? దీని ప్రభావం ఏయే పార్టీలపై పడబోతోంది? చాలామంది ఓటర్లు సొంతూరులో ఓటు హక్కుకు ప్రాధాన్యత ఇచ్చారా? గ్రేటర్‌లో దాదాపు 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించే అవకాశముందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

తెలంగాణలో రాజకీయ పార్టీలకు కొత్త టెన్షన్

Advertisement

 

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ-SIR సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న తాజా సమాచారం మేరకు దాదాపు 63.5 లక్షల ఓట్లు తొలగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గైర్హాజరు, ఒక చోట నుంచి మరోచోటికి మారినవారు, మరణించినవారు, నకిలీ ఓటర్లు ఇలా అన్ని కేటగిరీల కింద తొలగింపుకు రంగం సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

Advertisement

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో గ్రేటర్ పరిధిలో దాదాపు 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశమున్నట్లు అధికారుల అంచనా. శనివారం వ‌ర‌కు రాజధాని మూడు జిల్లాల పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో సుమారు మూడో వంతు ఓట్లు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 

సోమవారంతో ముగియనున్న ‘సర్’

 

సెలవులు ఉన్నప్పటికీ ఆది-సోమవారాల్లో బూత్ స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు విధుల్లో ఉన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఓట్ల తొలగింపు గ్రేటర్‌లో అన్ని నియోజకవర్గాల్లో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నట్లు సమాచారం.

 

63 లక్షల ఓట్లుపై వేటు పడే అవకాశం

 

సనత్‌నగర్‌ నియోజకవర్గంలో రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 1.16 లక్షల ఓట్లు రద్దయ్యే అవకాశం ఉన్నాయి. దాదాపు 45.68 శాతం అన్నమాట. జూబ్లీహిల్స్‌- 44 శాతం, ఎల్బీనగర్‌-42 శాతం, ఉప్పల్‌-40 శాతం, మహేశ్వరం- 40 శాతం ఓట్లు జాబితా నుంచి తొలగించే అవకాశాలు ఉన్నట్లు అధికారుల మాట. ఆది-సోమవారాల్లో ఈ సంఖ్యల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ALSO READ: బోనాల పండగ ఎలా ప్రారంభమైంది? ఆషాడ బోనాల వెనుక ఆసక్తికరమైన విషయాలు

తెలంగాణలో డిజిటలీకరణ 78 శాతం కాగా, శనివారం నాటికి హైదరాబాద్‌లో 58.41 శాతంగా ఉంది. ఆగస్టు 10 చివరి తేదీగా కాగా, రెండో శనివారం, ఆదివారం, సోమవారం బోనాలు పండుగ సెలవుల వల్ల, బూత్ స్థాయి అధికారులు శుక్రవారం నాటికి చాలావరకు పనిని పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించారు. పనిలో ఉన్న BLOలు ప్రజలు తమ గణన పత్రాలను సమర్పించడం కోసం వేచి ఉండలేదు. అలాంటి వారిని ASDD కేటగిరీలో గుర్తిస్తున్నారు. సోమవారం గడువు ముగిసిన తర్వాత ఎంతమంది ఓటర్లు అనేది తేలనుంది. ఆగస్టు 17న వెలువడనున్న ముసాయిదా జాబితాపై అన్ని పార్టీల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×