E-Paper
Advertisement

బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి
Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: 2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 Odi World Cup) దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ టోర్నమెంట్ కోసం అన్ని జట్లు సంసిద్ధమవుతున్నాయి. సాధ్యమైనంత వరకు వన్డేలు ఆడేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్షన్ కమిటీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag ). హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ లాంటి ప్లేయర్లతో టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదని బాంబు పేల్చాడు. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ లను తిరిగి జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రూప్ స్టేజిలోనే టీమ్ ఇండియా ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. వ‌రుస‌గా గాయ‌ల బారీన ప‌డుతోన్న బుమ్రాను ఇక ప‌క్క‌కు పెట్టండి అంటూ సూచ‌న‌లు చేశారు వీరేంద్ర సెహ్వాగ్.

ఈ ముగ్గురితో వెళితే.. వ‌ర‌ల్డ్ క‌ప్ గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియా ఎలిమినేట్

2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పైన భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్ అయ్యారు. బౌలింగ్ ఎంపిక వ్యూహంలో.. అజిత్ అగార్కర్ దారుణంగా విఫలమవుతున్నాడని మండిపడ్డారు. టీమిండియా కు అవసరమైన ప్లేయర్లను సెలెక్ట్ చేయడం లేదని ఆగ్రహించారు. కొత్త కొత్త బౌలర్లను తీసుకువచ్చి టీం ఇండియాను నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Advertisement

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ లాంటి ప్లేయర్లను తీసుకువచ్చి టీమిండియా మెడకు తగిలేస్తున్నారని ఆగ్రహించారు. వీళ్ళ వయసు 22 నుంచి 25 సంవత్సరాలు మాత్రమే ఉందని… దీంతో ఫ్యూచర్ స్టార్స్ అనే ట్యాగ్ వేసి రుద్దుతున్నారని మండిపడ్డారు. ఈ ముగ్గురు బౌలర్లతో దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం వెళితే.. టీమిండియా బొక్క బోర్లా పడుతుందని హెచ్చరించారు. అక్కడి బౌన్సీ మైదానాలకు ఈ బౌలర్లు తట్టుకోలేరని తెలిపారు.

సిరాజ్, భువనేశ్వర్, షమీలకు వెంట‌నే ఛాన్స్ ఇవ్వండి

Advertisement

మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ లాంటి సీనియర్లను అజిత్ అగార్కర్ ఎందుకు పట్టించుకోవడంలేదని వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు. ఎన్నో రోజులుగా జాతీయ జట్టులోకి వచ్చేందుకు దేశీయ క్రికెట్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ వాళ్లను సెలెక్టరు పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. ఈ ముగ్గురు బౌలర్లను వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం సెలెక్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బూమ్రా కు ఎలాగు గాయాలు అవుతున్నాయి… అతని పక్కన పెడితే బెటర్ అన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో బుమ్రా ఆడేది కష్టమేనని తెలిపారు. అదే స‌మ‌యంలో అనుభ‌వం ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌ను తీసుకోవాల్సిందేన‌ని తెలిపారు వీరేంద్ర సెహ్వాగ్.

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

Related News

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్

న్యూజిలాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఒత్తిడిలోకి నెట్టి..బౌన్సర్లతో టార్చర్ చేస్తాం

Big Stories

Advertisement
×