E-Paper
Advertisement

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!
Advertisement

OnePlus 32-Inch Y-Series TV Review: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ స్మార్ట్ టీవీలు కామన్ అయిపోయాయి. సాధారణ కేబుల్ కనెక్షన్ల స్థానంలో ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాక స్మార్ట్ టీవీల వాడకం కూడా విపరీతంగా పెరిగింది. అయితే తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన బ్రాండ్ నుంచి మంచి టీవీ కొనాలని అనుకునే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి వారి కోసం ప్రముఖ టెక్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) మార్కెట్లోకి తెచ్చిన వై-సిరీస్ స్మార్ట్ టీవీ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంతకీ దీని ఫీచర్లు , ధర వివరాలు ఎంటో  తెలుసుకుందామా.

1.డిజైనింగ్ ,డిస్‌ప్లే క్వాలిటీ :

ఈ టీవీ బెజెల్‌లెస్ డిజైన్‌తో చాలా అట్రాక్టీవ్‌గా కనిపిస్తుంది. గోడకు పెట్టుకున్నా లేదా టేబుల్ ఉంచినా కూడా లివింగ్ రూమ్ లుక్ మారి పోతుంది. ఇందులో ఉన్న 32 ఇంచుల హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే రంగులను చాలా సహజంగా చూపిస్తుంది. అంతే కాకుండా ఇందులోని వన్‌ప్లస్ సొంత గామా ఇంజిన్ టెక్నాలజీ కారణంగా ..వీడియో క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ సేపు టీవీ చూసినా కళ్లపై ఒత్తిడి పడకుండా.. కంటెంట్ క్లియర్‌గా కనిపిస్తుంది.

2.సౌండ్ క్వాలిటీ ,డాల్బీ ఆడియో:

Advertisement

చాలా చిన్న టీవీలలో.. సౌండ్ సరిగ్గా రాదనే కంప్లైంట్ ఉంటుంది. కానీ ఈ వన్‌ప్లస్ టీవీలో 20 వాట్ల స్పీకర్లతో పాటు డాల్బీ ఆడియో సపోర్ట్ ఇచ్చారు. దీని వల్ల సినిమాలు చూసేటప్పుడు లేదా పాటలు వినేటప్పుడు థియేటర్ లాంటి సరౌండ్ సౌండ్ ఫీల్ కలుగుతుంది. ఎక్స్‌ట్రా హోమ్ థియేటర్ అవసరం లేకుండానే.. రూమ్ మొత్తం సౌండ్ చక్కగా వినిపిస్తుంది.

3. ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫారమ్ :

ఇది గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీ, ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్‌లను నేరుగా డౌన్‌ లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉండటం ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చి మీకు నచ్చిన ఛానెల్స్ లేదా వీడియోలను సెర్చ్ చేయవచ్చు. క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్ ఫీచర్ ద్వారా మీ మొబైల్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి! 

4.కనెక్టివిటీ ఆప్షన్లు:

ఈ టీవీలో బ్లూటూత్ , వై-ఫై సపోర్ట్‌తో పాటు, వెనక వైపు మల్టిపుల్ పోర్ట్స్ ఇచ్చారు.బాక్స్, గేమింగ్ కన్సోల్ లేదా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడానికి 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు అందుబాటులో ఉన్నాయి.

ధర:

అన్ని లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ టీవీ మోడల్ అధికారిక ధర మార్కెట్లో సుమారు రూ.14,999 గా ఉంది. అమెజాన్ లేదా ఫ్లిప్ కార్డ్‌లో జరిగే సేల్స్ సమయంలో బ్యాంక్ ఆఫర్లు పోను మరింత తక్కువ ధరకు.. ఈ టీవీని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

రూ.15 వేల బడ్జెట్‌లో ప్రీమియం బ్రాండ్, అదిరిపోయే పిక్చర్, సౌండ్ క్వాలిటీ కోరుకునే చిన్న కుటుంబాలకు ఈ వన్‌ప్లస్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ డిజిటల్ యుగంలో మీ ఇంటర్‌టైన్‌మెంట్‌ను డబుల్ చేయడానికి ఇది చక్కటి అవకాశం.

Related News

వాల్ క్లాక్ ఆగిపోయిందని పారేస్తున్నారా? ఈ చిన్న పని చేస్తే.. మళ్ళీ నడుస్తుంది!

ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Big Stories

Advertisement
×