E-Paper
Advertisement

పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు బెస్ట్..రూ.18 వేలలోపు అదిరిపోయే లెనోవా స్మార్ట్ ట్యాబ్!

పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు బెస్ట్..రూ.18 వేలలోపు అదిరిపోయే లెనోవా స్మార్ట్ ట్యాబ్!
Advertisement

Lenovo Tab Smartchoice: ప్రస్తుతం.. ల్యాప్‌టాప్‌ల తర్వాత ట్యాబ్‌ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆఫీస్ వర్క్, పిల్లల ఆన్‌లైన్ క్లాసులు,ఈ-బుక్స్ చదవడం, ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ట్యాబ్ ఉండటం చాలా అవసరవ. అయితే ప్రముఖ టెక్ బ్రాండ్ లెనోవా తన కస్టమర్ల కోసం అద్భుతమైన ఫీచర్లతో Lenovo Tab (Smartchoice) ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది.తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ట్యాబ్  ముఖ్యమైన ఫీచర్లు, ధరకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Lenovo Tab (Smartchoice) ఫీచర్లు;

1.డిజైన్ బిల్డ్ క్వాలిటీ:

ఈ ట్యాబ్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది ప్రీమియం మెటల్ బాడీతో వస్తుంది. దీని వల్ల చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. చేతిలో పట్టుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. దీని లైట్‌వెయిట్ డిజైన్ కారణంగా ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు బ్యాగ్‌లో సర్దుకోవడం చాలా ఈజీ. పిల్లలు లేదా పెద్దలు ఎవరైనా రోజంతా దీనిని ఈజీగా ఉపయోగించవచ్చు.

2. డిస్‌ప్లే విజువల్ ఫీల్:

Advertisement

ఈ టాబ్లెట్‌లో 10.1 ఇంచుల పెద్ద డిస్‌ప్లేను అందించారు. ఆన్‌లైన్ క్లాసులు వినేటప్పుడు.. లేదా సినిమాలు చూసేటప్పుడు పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల కంటిపై.. ఒత్తిడి పడకుండా క్లియర్‌గా కనిపిస్తుంది. రంగులు చాలా సహజంగా, షార్ప్‌గా ఉండటం దీని మరో పెద్ద ప్లస్ పాయింట్. అంతే కాకుండా యూట్యూబ్ వీడియోలు, నెట్‌ఫ్లిక్స్ లేదా ప్రైమ్ వీడియో కంటెంట్‌ను ఇందులో అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు.

3.మెమరీ,పెర్ఫార్మెన్స్ :

మనం చేసే వివిధ రకాల పనులు.. ఎలాంటి లాగ్ లేకుండా సాఫీగా సాగడానికి ఇందులో 4 GB RAM , 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. ఒకవేళ మీకు స్పేస్ సరిపోకపోతే. మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో దీని స్టోరేజ్ ఏకంగా 1 TB వరకు పెంచుకోవచ్చు . దీనివల్ల వేలాది ఫోటోలు, వీడియోలు, యాప్‌లను ఎలాంటి భయం లేకుండా సేవ్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి 

4.సౌండ్, కనెక్టివిటీ :

మ్యూజిక్, సినిమా ఫీల్ మరింత పెంచడానికి ఇందులో డ్యూయల్ స్పీకర్లను అందించారు. ఎలాంటి .. ఎక్స్‌ట్రా స్పీకర్లు అవసరం లేకుండానే గది మొత్తం సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది. ఇది కేవలం వై-ఫై మోడల్ కాబట్టి.. ఇంట్లో లేదా ఆఫీస్‌లో వై-ఫై నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.

ధర వివరాలు:

అన్ని లేటెస్ట్ ఫీచర్లు, లెనోవా బ్రాండ్ నమ్మకంతో వస్తున్న ఈ ట్యాబ్ మార్కెట్లో కేవలం రూ. 17,950 ధరకే లభిస్తోంది. అమెజాన్ లేదా ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో సేల్స్ సమయంలో ..బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకు ఇది అందుబాటులోకి రావచ్చు.

తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, మంచి బ్యాటరీ బ్యాకప్ , మెటల్ బాడీ కలిగిన బ్రాండెడ్ ట్యాబ్ కోరుకునే వారికి ఈ లెనోవా స్మార్ట్ చాయిస్ ట్యాబ్ బెస్ట్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా స్టూడెంట్స్‌కి, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇది ఒక చక్కటి గార్జెట్.

Related News

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×