స్మార్ట్ ఫోన్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఫోన్ ద్వారానే అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆఫీస్ పనులతో పాటు వ్యక్తిగత పనులను ఫోన్ మీదే నడిపిస్తున్నారు. నిత్యం ఫోన్ లో మాట్లాడే వాళ్లు తమ సౌకర్యం కోసం హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తారు. ఈ హెడ్ ఫోన్స్ రెండు రకాలుగా ఉంటాయి. వాటిలో ఒకటి వైర్ తో ఉన్న హెడ్ ఫోన్స్ కాగా, మరొకటి వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ఉన్నవి. ఇంతకీ ఈ హెడ్ ఫోన్స్ మధ్య తేడాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కనెక్షన్:
⦿ వైర్డు హెడ్ ఫోన్లు: ఇవి 3.5mm ఆడియో జాక్ లేదంటే USB ద్వారా మొబైల్, ల్యాప్ టాప్ తో కనెక్ట్ అవుతాయి. వైర్ ద్వారా ఆడియో సిగ్నల్ ట్రాన్స్ మిట్ అవుతాయి.
⦿ వైర్ లెస్ హెడ్ ఫోన్లు: ఇవి బ్లూటూత్, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వైర్ లేకుండా డివైజ్ తో కనెక్ట్ అవుతాయి.
సాధారణంగా వైర్ తో కూడిన హెడ్ ఫోన్లు ఆడియో నాణ్యతకు, వైర్ లెస్ హెడ్‌ఫోన్లు సౌకర్యానికి అనుగుణంగా ఉంటాయి.
ఆడియో క్వాలిటీ:
⦿ వైర్డు: సాధారణంగా ఎలాంటి ఆడియో లాస్ లేకుండా స్పష్టంగా వినిపిస్తాయి. ఎందుకంటే డేటా ట్రాన్స్ మిషన్ లో సిగ్నల్స్ కోల్పోయే అవకాశం ఉండదు.
⦿ వైర్ లెస్: బ్లూటూత్ కంప్రెషన్ కారణంగా నాణ్యత కొంత తగ్గుతుంది. కొత్త మోడల్స్ వైర్ లెస్ హెడ్ ఫోన్లు కూడా ఇప్పుడు మంచి క్వాలిటీ ఆడియోను అందిస్తున్నాయి.
మొబిలిటీ:
⦿ వైర్డు: వైర్ కారణంగా అటు ఇటు కదిలించడం ఇబ్బంది అవుతుంది. గంటలు తరబడి డివైజ్ తో కనెక్ట్ చేయాల్సి వస్తుంది.
⦿ వైర్ లెస్: వైర్ లేనందున సౌకర్యవంతంగా, ఎక్కువ దూరం వరకు ఉపయోగించవచ్చు.
బ్యాటరీ:
⦿ వైర్డు: ఇది వైర్ కలిగి ఉంటుంది కాబట్టి బ్యాటరీ అవసరం లేదు.
⦿ వైర్ లెస్: ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ అయిపోతే ఉపయోగించలేం.
ధర:
⦿ వైర్డు: సాధారణంగా తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి.
⦿ వైర్ లెస్: ఆడియో నాణ్యత, టెక్నాలజీ కారణంగా కాస్త ఎక్కువ ధర ఉంటాయి.
మెయింటెనెన్స్:
⦿ వైర్డు: వైర్ డ్యామేజ్ అవడంతో పాటు చిక్కుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది.
⦿ వైర్ లెస్: బ్లూటూత్ పేరింగ్ సమస్యలు, ఇంటర్ఫరెన్స్ ఉండొచ్చు.
⦿ వైర్డు హెడ్ ఫోన్లు: కదలకుండా కూర్చొనే వారికి, స్టూడియోలో ఉపయోగించే వారికి, బ్యాటరీ ఆందోళన లేకుండా ఉపయోగించాలనుకునేవారికి బెస్ట్. ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉంటుంది.
⦿ వైర్ లెస్ హెడ్ ఫోన్లు: మరింత సౌకర్యంగా ఉండాలనుకునే వారికి ప్రయాణ సమయంలో అనుకూలంగా ఉండేందుకు ఇవి బాగుంటాయి. బ్యాటరీ మేనేజ్‌మెంట్, ధర గురించి ఆలోచించాలి.
ఆడియో నాణ్యతకు ప్రాధాన్యమిస్తే వైర్ తో కూడిన హెడ్ ఫోన్స్, సౌకర్యంగా ఉండాలని కోరుకునే వారు వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ను తీసుకోవడం మంచిది.
Read Also: స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లపై 90% డిస్కౌంట్, ఇన్ స్టామార్ట్ కళ్లు చెదిరే ఆఫర్!