ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ యాజమాన్యంలోని ఇన్ స్టామార్ట్ తొలి వార్షికోత్సవం సందర్భంగా మెగా సేల్ నిర్వహిస్తోంది. క్విక్ ఇండియా మూవ్‌మెంట్ సేల్ ను సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 28 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇయర్ బడ్ లు, స్మార్ట్ వాచ్ లు, స్పీకర్లు, పవర్ బ్యాంకులు సహా పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై 90 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. డిస్కౌంట్లతో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలుదారులు అదనంగా రూ. 1,000 నుంచి 10 శాతం తగ్గింపును పొందుతారు.
⦿ స్మార్ట్ ఫోన్లు
1.OnePlus Nord CE 4 Lite: ఈ స్మార్ట్ ఫోన్ ఎమ్మార్పీ రూ. 18,999 ఉండగా, ఈ సేల్ లో రూ. 16,999కే లభిస్తుంది.
2.Oppo K13x: ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.16,999 ఉండగా ఈ సేల్ లో రూ. 12,499కే లభిస్తోంది.
3.Realme Narzo 70 Turbo: రూ. 19,999 ఎమ్మర్పీ ఉండగా రూ. 13,999కే లభిస్తుంది.
⦿ ల్యాప్ టాప్‌లు
1.Lenovo IdeaPad Slim 3 (i5, 16GB RAM, 512GB SSD): ఎమ్మార్పీ రూ. 70,790 ఉండగా ఈ సేల్ లో రూ. 48,999కే అందిస్తున్నారు.
2.ASUS Vivobook (Ryzen 3, 512GB SSD): దీని ధర రూ. 44,990 కాగా, రూ. 29,999కే లభిస్తుంది.
⦿ వైర్ లెస్ ఇయర్ బడ్‌లు
1.boAt Airdopes 311 Pro: ఎమ్మార్పీ రూ. 4,990 కాగా, రూ. 799 కే అందుబాటులో ఉంది.
2.OnePlus Nord Buds 2r (డీప్ గ్రే): ఎమ్మార్పీ రూ. 2,299 కాగా, రూ. 1,499కే లభిస్తుంది.
⦿ స్మార్ట్ వాచ్‌లు
1.నాయిస్ క్యాలిబర్ 3 గో: ఎమ్మార్పీ రూ. 5,999 కాగా ఈ సేల్ లో రూ. 899కే పొందే అవకాశం ఉంది.
Read Also: జియో, ఎయిర్ టెల్, VI.. డైలీ డేటాలో బెస్ట్ మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!
⦿ ఆడియో డివైజ్ లు:
1.JBL ఫ్లిప్ 5 వైర్‌లెస్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్: రూ. 4,999కే లభిస్తుంది.
2.పోర్ట్రానిక్స్ కాంచ్ థెటా సి వైర్డ్ టైప్-సి ఇయర్ ఫోన్లు: ఎమ్మార్పీ రూ. 799 కాగా, రూ. 199కే లభిస్తున్నాయి.
⦿ ప్రొజెక్టర్లు
1.పోర్ట్రానిక్స్ బీమ్ 440 స్మార్ట్ LED ప్రొజెక్టర్: రూ. 4,499కే లభిస్తుంది.
⦿ పవర్ బ్యాంక్‌లు
1.boAt EnergyShroom PB400 20000mAh: దీని ఎమ్మార్పీ రూ. 4999 ఉండగా, రూ. 1,249కే లభిస్తుంది.
Read Also: ఏడాది వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్.. తక్కువ ధరకే BSNL క్రేజీ ప్లాన్!