Women’s Day 2025: ప్రపంచాన్ని మహిళలు లేకుండా ఊహించగలమా, అంటే చాలా కష్టం. ప్రతి ఇంట్లో, ప్రతి పనిలో కూడా మహిళల భాగస్వామ్యం ఉంటుంది. నిజం చెప్పాలంటే మహిళలు లేకుండా ఒక రోజు కూడా గడవదని చెప్పొచ్చు. అలాంటి వారి సేవలను గుర్తించి, మరింత అభిమానించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలను ఈ ఉమెన్స్ డే (మార్చి 8న) సందర్భంగా సర్‌ప్రైజ్ చేయండి. ఈ ప్రత్యేక రోజున మీ తల్లి, భార్య, సోదరి, లేదా స్నేహితురాలికి ప్రత్యేకమైన గాడ్జెట్ బహుమతులను అందించి, వారి ముఖంలో చిరునవ్వులు పూయించండి. ఇప్పుడు ఉమెన్స్ డే 2025 సందర్భంగా మహిళలకు అందించాల్సిన ప్రత్యేక టెక్ బహుమతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మీ తల్లి, భార్య లేదా సోదరి సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడితే వారికి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ గిఫ్టుగా ఇవ్వొచ్చు. ప్రస్తుతం Realme Buds T110 రూ. 1,500 బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఇది తేలికైన డిజైన్‌తో 38 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. దీంతోపాటు OnePlus Nord Buds 2 (రూ. 2,699) లేదా OnePlus Buds 3 (రూ. 6,499) కూడా మంచి ఎంపికలని చెప్పవచ్చు.
మీ మహిళల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే స్మార్ట్‌వాచ్‌లు మంచి ఎంపిక. అమాజ్‌ఫిట్ GTR2 (రూ. 7,999) వంటి స్మార్ట్‌వాచ్‌లు, హార్ట్ రేట్ మానిటరింగ్, స్టెప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో మీ తల్లి లేదా భార్య ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి సహాయపడతాయి. గార్మిన్ కూడా మంచి స్మార్ట్‌వాచ్‌లను అందిస్తుంది. దీంతోపాటు మరికొన్ని మోడల్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
Read Also: Vivo T4x 5G: బడ్జెట్ ధరల్లో బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..
మీ తల్లి లేదా భార్య స్మార్ట్‌వాచ్‌ను ఇష్టపడకపోతే, మీరు స్మార్ట్ రింగ్‌లను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. అమాజ్‌ఫిట్ హీలియో రింగ్ (రూ. 20,000) ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతోపాటు ఫ్యాషన్ ట్రెండీగా ఉంటుంది. ఆన్ లైన్లో మరికొన్ని ఎంపికలు కూడా ఉన్నాయి.
మహిళలకు శ్రమ తగ్గించడానికి ఇంట్లో క్లీనింగ్ కోసం రోబోట్ వాక్యూమ్ క్లీనర్ కూడా ఒక మంచి ఎంపికగా ఉంటుంది. Xiaomiలో రూ. 9,999 నుంచి ప్రారంభమయ్యే రోబోట్ వాక్యూమ్ క్లీనర్లు, ఇంటి పనులను సులభతరం చేసుకునేందుకు సౌలభ్యంగా ఉంటాయి. మరోవైపు డైసన్ మాప్ వాష్ G1 (రూ. 60,000) వంటి అధిక ధర ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఇవి మీ తల్లి లేదా భార్యకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి.
ఇంట్లో మీ తల్లి లేదా భార్య ఎక్కువగా వంట చేయడం ఇష్టపడితే వారికి ఎలక్ట్రిక్ చాపర్‌లు మంచి బహుమతిగా అందించవచ్చు. INALSA ఛాపర్ వంటివి వంటలో సమయాన్ని ఎంతో ఆదా చేస్తాయి. INALSA ఛాపర్ ( రూ.1,500), బాష్ వంటి ఇతర బ్రాండ్లు కూడా ఈ విభాగంలో మంచి ఎంపికలుగా ఉన్నాయి. ఈ మహిళా దినోత్సవం రోజు మీరు మీ కుటుంబంలోని మహిళలకు ప్రత్యేకమైన బహుమతి అందించి వారిని మరింత సంతోషపరచండి.