E-Paper
Advertisement

SSMB29 : రాజమౌళి మూవీలో మహేష్ పాత్ర పేరు ఇదే..? థియేటర్లు దద్దరిల్లాల్సిందే…

SSMB29 : రాజమౌళి మూవీలో మహేష్ పాత్ర పేరు ఇదే..? థియేటర్లు దద్దరిల్లాల్సిందే…

SSMB29 : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.. గత ఏడాది గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది. ఆ మూవీ తర్వాత ఏ మూవీతో ప్రేక్షకులను పలకరిస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగానే దర్శకు ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని అనౌన్స్ చేసి రెండేళ్లయింది. ఇప్పటికి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళింది. ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ప్రపంచం మొత్తం దృష్టీ ఈ కాంబోపైనే ఉంది. ఈ సినిమా గురించి ఏ విషయం బయటకు రానివ్వడం లేదు రాజమౌళి.. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

రాజమౌళి, మహేష్ కాంబినేషన్ వస్తున్న మూవీ కోసం యావత్ ని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఎలాంటి పాత్రలో కనిపిస్తారని అటు మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు రోల్ ఇదే అంటూ ఓ వార్త నెట్టింట ప్రచారం చేస్తుంది. తాజాగా ఈ సినిమాలోని మహేష్ పాత్ర గురించిన ఓ హింట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ `రుద్ర`గా కనిపిస్తాడట. అది తన క్యారెక్టర్ పేరు.. మహేష్ బాబు నటించిన సినిమాలు విషయంలో ఒక్క సినిమా ఒక్కోలా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది అలాగే ఈ సినిమాలో కూడా పవర్ఫుల్ పేరులో కనిపిస్తే మంచి హిట్ అవుతుందని ప్రిన్స్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

Also Read :మెగా హీరోలను వదలని కుర్ర హీరోయిన్.. ఇదేం పిచ్చి రా బాబు..

‘రుద్ర’ని మహేష్ ఫ్యాన్స్ ఎంత వరకూ ఓన్ చేసుకొంటారో చూడాలి. ఇటీవల హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 12 రోజుల పాటు షూట్ చేశారు. ఓ కీలకమైన సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ షూట్ లో మహేష్‌, ప్రియాంకా చోప్రాతో పాటు నానా పటేకర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. నానా పటేకర్ మహేష్ తండ్రిగా నటించనున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడా టీమ్ బయటకు రానివ్వలేదు. కొత్త షెడ్యూల్ ఒరిస్సాలో మొదలైందని తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇక్కడే ఒక 15 రోజులు పాటు జరగనుంది ఆ తర్వాత విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ‘గరుడ’ అనే పేరు పరిశీలనలో వుంది. అయితే పాన్ వరల్డ్ సినిమా కాబట్టి, ఇంగ్లీష్ టైటిల్ కోసం చిత్రయూనిట్ వెతుకుతుంది. మొత్తానికైతే ఈ కాంబినేషన్ సినిమాకు అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి మహేష్ బాబును రాజమౌళి ఎలా చూపిస్తారని ఫాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. అనుకున్నట్లుగా షూటింగ్ పూర్తి అయితే వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×