Vivo T4x 5G: స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పటికప్పుడు అనేక ఫోన్లను మారుస్తుంటారు. అలాంటి వారితోపాటు బడ్జెట్ ప్రియులకు కూడా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తాజాగా బడ్జెట్ ధరల్లోనే అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఈ క్రమంలోనే వివో కంపెనీ కొత్తగా Vivo T4x 5G అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1050 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ మోడల్ TUV రీన్‌ల్యాండ్ ప్రోటెక్షన్ తో వస్తుంది. ఇది అద్భుతమైన దృశ్య అనుభవాన్ని అందిస్తుంది. ఇది Mediatek Dimensity 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉండటంతోపాటు Android 15 ఆధారంగా Funtouch OS 15పై పనిచేస్తుంది.
దీనిలో ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీంతోపాటు ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఈ ఫోన్ 6,500mAh బ్యాటరీని కలిగి ఉండి, 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ విభాగంలో ఇదే అతిపెద్ద బ్యాటరీ అని కంపెనీ చెబుతుండటం విశేషం. ఈ ఫోన్‌ను 40 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
Read Also: New SIM Card Rules: కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. ఇలా చేశారో రూ. 50 లక్షల ఫైన్
ఈ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ విషయానికి వస్తే 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, GLONASS, Beidou వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనిలో USB టైప్ సీ పోర్ట్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కొలతల విషయానికి వస్తే 165.7×76.3×8.09mm కాగా, ప్రోంటో పర్పుల్ వెర్షన్ బరువు 204 గ్రాములు, మెరైన్ బ్లూ వేరియంట్ బరువు 208 గ్రాములుగా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ చేయబడింది. దీని బేస్ మోడల్ 6GB + 128GB ధర రూ.13,999. 8GB + 128GB వేరియంట్ ధర రూ.14,999గా ప్రకటించారు. అదే సమయంలో దీని 8GB + 256GB మోడల్ కోసం, వినియోగదారులు రూ.16,999 చెల్లించాలి. ఈ మోడల్ పోన్ పర్పుల్, మెరైన్ బ్లూ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ మార్చి 12 నుంచి వివో వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. HDFC, SBI, Axis బ్యాంక్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కస్టమర్లకు రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ మోడల్ కొనుగోలు సమయంలో వినియోగదారులకు మరిన్ని తగ్గింపులు వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also: Woman Growing Saffron: ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు.. రూ.32 లక్షల ఆదాయం పొందుతున్న మహిళ