BigTV English

Commercial Space Station: అంతరిక్ష హోటల్ లో ఎంజాయ్ చేద్దాం పదండి, వచ్చే ఏడాదే ప్రారంభం!

Commercial Space Station:  అంతరిక్ష హోటల్ లో ఎంజాయ్ చేద్దాం పదండి, వచ్చే ఏడాదే ప్రారంభం!

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు సరికొత్తగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటి వరకు భూమ్మీద చిత్ర విచిత్రాలు చేసిన కంపెనీలు ఇకపై అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే అమెరికన్ స్పేస్ టెక్ కంపెనీ వాస్ట్ అంతరిక్షంలో లగ్జరీ హోటల్ ను నిర్మించబోతోంది. భూమ్మీద ఉండే లగ్జరీ హోటళ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో దీన్ని రూపొందిస్తోంది. తాజాగా తమ కంపెనీ స్పేస్ లో కట్టే కమర్షియల్ స్పేస్ స్టేషన్ డిజైన్ ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంటికి ఇంపైన వాల్స్, స్పేస్ లోకి చూసేందుకు అందమైన విండోలు ఆకట్టుకుంటున్నాయి.


ఆగస్ట్ 2025లో స్పేస్ లోకి హెవెన్ -1 హోటల్

వాస్ట్ కంపెనీ రూపొందిస్తున్న స్పేస్ హోటల్ కు హెవెన్-1గా పేరు పెట్టింది. ఈ హోటల్ ను వచ్చే ఏడాది(2025) ఆగష్టులో నింగిలోకి తీసుకెళ్లనున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ రాకెట్ ఈ హోటల్ ను అతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. భూమికి కొన్ని వందల కిలో మీటర్ల దూరంలో ఈ హోటల్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో లగ్జరీ హోటల్ కు ఏమాత్రం తీసిపోని విధంగా వసతులు కల్పిస్తున్నారు. ఈ హోటల్ లో బస చేసే వాళ్ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇందులో నివసించే టూరిస్టులు చక్కగా నిద్రపోయేందుకు ప్రత్యేకంగా బెడ్లను రూపొందించారు. అత్యాధునిక జిమ్ ఏర్పాటు చేశారు. హార్ట్, బోన్ హెల్త్ కోసం ఆన్‌ బోర్డ్‌ ఫిట్‌ నెస్‌ సిస్టమ్ ను రూపొందించారు. ఇక స్పేస్ స్టేషన్ లో ఎంటర్ టైన్ మెంట తో పాటు స్పేస్‌ ఎక్స్ స్టార్‌ లింక్ కనెక్టివిటీ కోసం ప్రైవేట్ గదులు కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి భూమ్మీద ఉన్న తమ బంధు మిత్రులతో కనెక్ట్ కావచ్చు. ఇందులో ఇంటర్నెస్ సౌకర్యం కూడా ఉంటుంది.  అంతరిక్ష కేంద్రంలో డైనింగ్  ఏరియా, మీటింగ్ స్పేస్ తో పాటు కామన్ ఏరియా ఉంటుంది.


మాజీ హ్యోమగాముల సమక్షంలో హెవెన్-1 తయారీ

ఆకాశంలో నిర్మించే హెవెన్-1 కమర్షియల్ స్పేస్ స్టేషన్ ఇంటీరియర్ డిజైన్ ను అమెరికన్ మాజీ హ్యోమగాముల నేతృత్వంలో రెడీ అవుతోంది. పీటర్‌ రస్సెల్‌ క్లార్ట్‌,  ఆండ్రూ ఫ్యూస్టెల్‌ ఈ స్పేస్ హోటల్ ను రెడీ చేస్తున్నారు. ఫ్యూస్టెల్‌ ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్ లో ఏకంగా 225 రోజులు గడిపిన అనుభవం ఉంది. ఈ హోటల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో హ్యోమగాములు ఎలా ఉంటారో, అంతకంటే మెరుగైన వసతులతో సౌకర్యంగా ఉండేలా రూపొందిస్తున్నారు.

2026 నుంచి టూరిస్టుల అంతరిక్ష ప్రయాణం   

ఈ కమర్షియల్ స్పేస్ స్టేషన్ హెవెన్-1 2025లో ప్రారంభం కానుంది. అంతరిక్షంలో బస చేసేందుకు బుకింగ్ చేసుకున్న వాళ్లు, ఏడాది తర్వాత నింగిలోకి వెళ్లే అవకాశం ఉంది.  ఏడాది పాటు ఈ అంతరిక్ష హోటల్  పనితీరును పరిశీలించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగవని భావించిన తర్వాత స్పేస్ టూర్లు మొదలు పెట్టనున్నట్లు వాస్ట్ సంస్థ వెల్లడించింది. అయితే, స్పేస్ టూర్ కోసం ఒక్కో వ్యక్తి ఎంత ఫీజు చెల్లించాలి అనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే స్పేస్ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Read Also: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, ఎక్కువ కాలం స్పేస్ లో ఉన్న ఆ జీవులకు ఏమైందో తెలుసా?

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×