E-Paper
Advertisement

మొబైల్ కవర్ కొనే.. ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

మొబైల్ కవర్ కొనే.. ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
Advertisement

Phone heating problem: మనం ఎంతో ఇష్టపడి వేల రూపాయలు పెట్టి కొన్న స్మార్ట్‌ ఫోన్‌ను కింద పడిపోకుండా.. కాపాడుకోవడానికి వెంటనే ఒక అందమైన ఫోన్ కవర్‌ని తగిలించేస్తాం. కానీ మనం స్టైల్ కోసం లేదా సేఫ్టీ కోసం కొనే ఆ తప్పుడు ఫోన్ కవరే మన మొబైల్‌ను ‘కొలిమి’లా మార్చేస్తుందని మీకు తెలుసా? లోపల నుంచి ఫోన్ విపరీతంగా వేడెక్కడానికి, చివరికి బ్యాటరీ దెబ్బతినడానికి ఈ కవర్లే ప్రధాన కారణం కావచ్చు. ఫోన్ కవర్ కొనే ముందు ఏయే విషయాలు గమనించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్ అనేది ఈ రోజుల్లో మన శరీరంలోనే ఒక భాగంలా మారిపోయింది. దానిని సేఫ్ గా ఉంచుకోవడానికి అందరూ రకరకాల సిలికాన్, లెదర్ లేదా హార్డ్ ప్లాస్టిక్ కవర్లను వాడుతుంటారు. అయితే.. మార్కెట్లో దొరికే ప్రతి కవర్ మన ఫోన్‌కు సరిపోతుందని అనుకోవడం పెద్ద పొరపాటు. తప్పుడు కవర్లను ఎంచుకోవడం వల్ల మొబైల్ పని తీరు తీవ్రంగా దెబ్బతింటుంది.

తప్పుడు ఫోన్ కవర్ల వల్ల వచ్చే ముప్పు:

Advertisement

వేడెక్కడం: స్మార్ట్‌ఫోన్ వాడేటప్పుడు ప్రాసెసర్ వేడెక్కుతుంది. ఆ వేడి గాలి బయటకు పోవడానికి ఫోన్ బాడీ సహకరిస్తుంది. కానీ మందపాటి లేదా సరిగ్గా గాలి ఆడని కవర్లను వాడితే, ఆ వేడంతా ఫోన్ లోపలే లాక్ అయిపోయి మొబైల్ వేడిగా మారుతుంది.

బ్యాటరీ లైఫ్ దెబ్బతినడం: తరచూ ఫోన్ వేడెక్కడం వల్ల లిథియం-అయాన్ బ్యాటరీ సామర్థ్యం వేగంగా పడిపోతుంది. కొన్నిసార్లు బ్యాటరీ ఉబ్బిపోయే ప్రమాదం కూడా ఉంది.

Advertisement

సిగ్నల్, నెట్‌వర్క్ సమస్యలు: క్వాలిటీ లేని మెటల్ లేదా అయోనిక్ కవర్లు వాడినప్పుడు ఫోన్‌కు టవర్ సిగ్నల్స్ సరిగ్గా అందవు. దీని వల్ల కాల్ డ్రాప్స్, ఇంటర్నెట్ స్లో అయ్యే సమస్యలు వస్తాయి.

Also Read: ఫోన్ మీ మాటలన్నీ రహస్యంగా వింటుందా? ఇలా తెలుసుకోండి

ఫోన్ కవర్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

మంచి మెటీరియల్ : చాలా మందంగా ఉండే రబ్బర్ లేదా క్వాలిటీ లేని ప్లాస్టిక్ కవర్లకు బదులుగా.. హీట్‌ను ఈజీగా పాస్ చేసే క్వాలిటీ సిలికాన్ లేదా బ్రీతబుల్ కవర్లను వాడటం మంచిది.

కట్-అవుట్స్ : ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్, కెమెరా దగ్గర కవర్ అడ్డుగా ఉండకూడదు. కట్-అవుట్స్ కచ్చితంగా ఉంటేనే గాలి బయటకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

గేమింగ్ ఆడేటప్పుడు కేర్ ఫుల్: మీరు హెవీ గేమింగ్ ఆడేవారైతే లేదా ఎక్కువ సేపు వీడియో కాల్స్ మాట్లాడేవారైతే.. ఆ సమయంలో కవర్ తీసేయడం మీ ఫోన్ ఆరోగ్యానికి చాలా మంచిది.

ఫోన్‌ను అందంగా మార్చడానికి.. రక్షించుకోవడానికి కవర్ వాడటం ఎంత ముఖ్యమో, అది సరైనదో కాదో చూసుకోవడం అంతకంటే ముఖ్యం. తక్కువ ధరకో లేదా కేవలం అందం చూసో మొబైల్ కవర్లు కొని మీ ఖరీదైన స్మార్ట్‌ ఫోన్‌ను రిస్క్‌లో పడేయకండి.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×