Smartphone privacy tips: మనం ఏదైనా ప్రొడక్ట్ గురించి ఫ్రెండ్స్ తో.. మాట్లాడుకున్న కొన్ని నిమిషాలకే, మన సోషల్ మీడియా ఫీడ్‌లో.. అవే ప్రకటనలు దర్శనమిస్తుంటాయి. ఇది చూశాక “అసలు మన ఫోన్ మనం మాట్లాడే మాటలను రహస్యంగా వింటుందా?” అనే భయం చాలా మందిలో కలుగుతుంది. ఇది కేవలం అనుమానం మాత్రమే కాదు.. కొన్నిసార్లు యాప్‌లు మన ప్రమేయం లేకుండా మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేస్తుంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు మీ ఫోన్ మాటలు వింటోందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేం. అయితే ఈ డిజిటల్ సౌకర్యాల వెనక మన ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారుతోంది. మనం గూగుల్‌లో సెర్చ్ చేయకపోయినా.. కేవలం నోటితో మాట్లాడిన విషయాలు యాడ్స్ రూపంలో మన స్క్రీన్‌పై ప్రత్యక్షమవ్వడం వెనుక పెద్ద టెక్నాలజీయే ఉంది.
ఫోన్ వింటున్నట్లు ఎలా గుర్తించాలి?
గూగుల్, ఆపిల్ సంస్థలు యూజర్ల ప్రైవసీని కాపాడటానికి ఫోన్ స్క్రీన్ పైభాగంలో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను అందించాయి.
ఆరెంజ్ లేదా గ్రీన్ డాట్ : మీ ఫోన్ స్క్రీన్ పైభాగంలో కుడి మూలన చిన్న చుక్క (డాట్) కనిపిస్తుందా? ఒకవేళ ఆరెంజ్ లేదా పసుపు రంగు డాట్ కనిపిస్తే.. మీ ఫోన్ మైక్రోఫోన్ ఆన్‌లో ఉందని అర్థం. అదే గ్రీన్ డాట్ కనిపిస్తే కెమెరా లేదా మైక్ రెండూ బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తున్నాయి. మీరు ఎలాంటి కాల్ లేదా వాయిస్ రికార్డింగ్ చేయకపోయినా ఈ డాట్స్ కనిపిస్తే.. ఏదో ఒక యాప్ మీ రహస్యాలను వింటోందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రైవసీ సెట్టింగ్స్ చెక్ చేయడం ఎలా?
ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్ ప్రైవసీని కాపాడుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
మీ ఫోన్ Settings ఓపెన్ చేయండి. తర్వాత అందులో Privacy లేదా Privacy Dashboard ఆప్షన్‌కు వెళ్లండి. అక్కడ Permission Manager పై క్లిక్ చేసి, మైక్రోఫోన్ (Microphone) ఆప్షన్ ఓపెన్ చేయండి.
మీ ఫోన్‌లోని ఏయే యాప్స్ మైక్‌ను ఎప్పుడెప్పుడు వాడాయో పూర్తి హిస్టరీ కనిపిస్తుంది. మీకు అవసరం లేని యాప్స్‌కు మైక్ పర్మిషన్‌ను వెంటనే ‘Don’t allow’ లేదా ‘Only while using the app’ కు మార్చండి.
యాపిల్ ఐఫోన్ వాడేవారికి ప్రైవసీ చాలా కఠినంగా ఉంటుంది.
సెట్టింగ్స్‌లోకి వెళ్లి Privacy & Security పై క్లిక్ చేయండి. Microphone ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి, ఏ యాప్స్ మైక్ పర్మిషన్ కలిగి ఉన్నాయో చెక్ చేయండి. ఎవరికీ అవసరం లేని యాప్స్ పర్మిషన్స్ డిసేబుల్ చేయండి. అలాగే కంట్రోల్ సెంటర్‌లో పైన కనిపించే ఆరెంజ్ డాట్ ద్వారా ఏ యాప్ మైక్ వాడుతుందో ఎప్పటికప్పుడు గమనించవచ్చు.
Also Read: ల్యాప్‌టాప్‌తో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా ? అసలు విషయం తెలిస్తే..ఎప్పటికీ అలా చేయరు
ప్రైవసీ కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు:
అనుమానాస్పద యాప్స్‌కు నో : గేమ్స్ లేదా సాధారణ టూల్స్ యాప్స్ ఇన్‌స్టాల్.. చేసేటప్పుడు అవి అనవసరంగా మైక్, కాంటాక్ట్స్ లేదా లొకేషన్ పర్మిషన్స్ అడిగితే అస్సలు అనుమతించకండి.
గూగుల్ వాయిస్ అసిస్టెంట్: ‘Hey Google’ లేదా ‘Siri’ ఫీచర్లు నిరంతరం.. మీ వాయిస్ కోసం వింటూనే ఉంటాయి. మీకు అవసరం లేనప్పుడు ఈ అసిస్టెంట్ వేక్ వర్డ్స్ డిసేబుల్ చేసుకోవడం మంచిది.
టెక్నాలజీ మన జీవితాన్ని ఈజీ చేసినప్పటికీ, అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఎప్పటికప్పుడు మీ ఫోన్ పర్మిషన్స్ చెక్ చేసుకుంటూ.. అనవసరమైన యాప్స్ తొలగించడం ద్వారా మీ మాటలు, ప్రైవసీని సురక్షితంగా కాపాడుకోవచ్చు.