BigTV English
Advertisement

KBR park Road : బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లకు అధికారుల మార్కింగ్.. ఎందుకు చేశారో తెలుసా

KBR park Road : బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లకు అధికారుల మార్కింగ్.. ఎందుకు చేశారో తెలుసా

KBR park Road : చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుంది. ప్రముఖులకు ఒకలా, సామాన్యులకు ఒకలా ఉండదు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్ లో ఘటన ఆసక్తికలిగిస్తోంది. ఇప్పటికే ప్రముఖ నటుడు అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వ విధానాన్ని చూసి ఆశ్చర్యపడ్డ జనానికి.. ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ దిగ్గజ నేత జానారెడ్డి ఇళ్లకు ప్రభుత్వం మార్కింగ్ చేయడం చర్చనీయాంశమైంది.


భాగ్యనగరంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్డు ఒకటి. ప్రముఖుల నివాసులు, నగరంలోని కీలక ప్రాంతాలన్నీ ఈ పార్కు చుట్టూనే ఉండడంతో.. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే.. ఈ రోడ్డును విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ మేరకు.. ప్రాథమిక కసరత్తులు ప్రారంభించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న రహదారి నుంచి విస్తరణ చేపట్టనున్న వరకు మార్కింగ్ చేపట్టారు. కాగా.. ఈ మార్కింగ్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 86 ఆస్తులకు ప్రభుత్వ మార్కింగ్ చేయాల్సి వచ్చింది. అంటే.. ఆ మార్కింగ్ వరకు ఉన్న నిర్మాణాల్ని తొలగించాల్సి ఉంటుంది.

ఈ మార్కింగ్ లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం ఉండడంతో చర్చనీయాంశమవుతోంది. రోడ్ నంబర్ 45లోని బాలకృష్ణ నివాసం లోపల దాదాపు 6 అడుగుల మేర మార్కింగ్ చేశారు. అలాగే.. కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికీ ఈ రోడ్డు వెడల్పు ఎఫెక్ట్ తగిలింది. ఆయన ఇంటి ముందు ఉన్న ప్రహరీ గోడ సైతం బల్దియా అధికారులు చేసిన మార్కింగ్ లోపల ఉంది. దాంతో.. రేవంత్ సర్కార్ పనితీరుకు అంతా అభినందిస్తున్నారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా అందరికీ ఒకే తరహా విధానాన్ని అమలు చేయడాన్ని స్వాగిస్తున్నారు.


అయితే.. మార్కింగ్ చేసిన వరకు రోడ్డును విస్తరిస్తారా? లేక.. కొలతలు వేయడం వెనుక ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. బల్దియా సిబ్బంది మార్కింగ్ చేసిన స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చిన అనంతరం సంబంధిత పనులు మొదలు పెడతారనే చర్చ నడుస్తోంది. ఒకవేళ మార్కింగ్ చేసినంత వరకు ఆర్‌అండ్‌బీ భూమి అయితే యజమానులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఉండదు. లేకపోతే.. వారి నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరభ్యంతరంగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడంపై జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ట్రాఫిక్ కష్టాలకు చెక్..
కేబీఆర్ పార్క్ చుట్టూ నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందుల్ని త్వరితగతిన తగ్గించేందుకు రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి కీలక జంక్షన్లల్లో యుద్ధప్రాతిపదికన బ్రిడ్జులు, వంతెనలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే.. అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా.. కీలక జంక్షన్లలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా స్టీల్ బ్రిడ్జీలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే డిజైన్లు సైతం సిద్ధం చేయగా.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణాల కోసం ఇప్పటికే భూమి పరీక్షలు కూడా నిర్వహించారు. కాంక్రీట్ ఫ్లైఓవర్లు నిర్మిస్తే ఆలస్యమవుతుందని, ట్రాఫిక్ సమస్యలు మరింత అధికమవుతాయని భావిస్తున్న అధికారులు.. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణానికి మొగ్గుచూపుతున్నారు.

Related News

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Hyderabad: జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ హత్య కేసులో 24 గంటల్లోనే వీడిన మిస్టరీ!

Bandi Sanjay: బోరబండ రోడ్ షో రగడ.. పోలీసులు ఎంఐఎం తొత్తులా?, బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×