Sabalenka: యూఎస్ ఓపెన్ -2025 ఉమెన్స్ సింగిల్స్ విజేతగా బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా నిలిచారు. ఫైనల్ లో అమెరికా ప్లేయర్ అమండ అనిసిమోవపై 6-3, 7-6 తేడాతో గెలుపొందారు. విక్టరీ అనంతరం ఆమె ఎమోషనల్ అయ్యారు. సబలెంకా కు ఓవరాల్ గా ఇది నాలుగో గ్రాండ్ స్లామ్ కాగా వీటిలో రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. ఆమె యూఎస్ ఓపెన్ ఛాంపియన్ అవ్వడం ఇది రెండోసారి కావడం విశేషం.2025 యూఎస్ ఓపెన్ మొత్తం $90 మిలియన్ల ప్రైజ్ పూల్‌తో రికార్డ్‌లను బద్దలుకొట్టింది. ఇది టెన్నిస్ చరిత్రలో అతిపెద్దది అనే చెప్పాలి. 2024లో $75 మిలియన్ల నుండి పెరిగింది. ఒక మైలు రాయి ఎత్తుగడలో పురుషులు, మహిళల ఛాంపియన్‌ల ప్రైజ్ మనీ సమం చేయబడింది. సబలెంకా తన టైటిల్ డిఫెన్స్ కోసం $5 మిలియన్లను సంపాదించింది. 2024 US ఓపెన్ విజయం కోసం ఆమె $3.6 మిలియన్ల బహుమతితో పోలిస్తే దాదాపు 39% పెరిగింది. యూఎస్ ఓపెన్ రోజు రోజు కు డిమాండ్ పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రపంచ నెంబర్ వన్ డిఫెండింగ్ ఛాంపియన్ అరియానా సబలెంకా (Aryryana Sabalenka) ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో సబలెంకా ప్రత్యర్థి మార్కెటా వొండ్రోసోవా మోకాలి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. ఇక సెమీ ఫైనల్ లో జెస్సికా పెగులాతో తలపడి విజయం సాధించింది. మరోవైపు గత ఏడాది ఫైనల్ లో కూడా పెగులాను సబలెంకా స్ట్రెయిట్ సెట్లలో ఓడించింది. ఫైనల్ లో హోరా హోరీ పోరు సాగింది. బెలారస్ స్టార్ అరీనా సబలెంక యూఎస్ ఓపెన్ 2025 మహిళల సింగ్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. అమెరికా క్రీడాకారిణీ ఎనిమిదో సీడ్ అమండా అనిసిమోవా పై 6-3, 7-6(3) తేడాతో విజయం సాధించింది. కేవలం 1 గంటల 34 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. రెండు సెట్లలోనూ సబలెంక తన ఆటతీరుతో ఆధిపత్యం చెలాయించగా.. 24 ఏళ్ల అనిసిమోనా 17 ఏళ్ల సబలెంక ముందు తేలిపోయారు. ఇక ఈ విజయంతో సబలెంక నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను ఖాతాలో వేసుకున్నారు.
ఇందులో రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ లు, రెండు యూఎస్ ఓపెన్ లు ఉన్నాయి. టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ తరువాత యూఎస్ ఓపెన్ టైటిల్ ను కాపాడుకున్న తొలి క్రీడాకారిణిగా సబలెంక రికార్డు సృష్టించారు.మరోవైపు ఇగా స్వియా టెక్, నవోమి ఒసాకాలను ఓడించి ఫైనల్ వరకు వచ్చిన అనిసిమోవా, టాప్ సీడ్ సబలెంకను మాత్రం మట్టికరిపించలేకపోయారు. మరోవైపు అనిసిమోవా తన కెరీర్ లో ఈ ఒక్క గ్రాండ్ స్లామ్ టోర్నీలోనే ఫైనల్ కి చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. యూఎస్ ఓపెన్ చరిత్రలో రెండు సెమీ ఫైనల్స్ విజేతలు తొలి సెట్ ను కోల్పోయి నెగ్గడం ఇది రెండో సారి మాత్రమే. 1993లో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ), 4-6, 6-1, 6-0 తో మలీవా (స్విట్జర్లాండ్) పై హెలెనా సుకోవా (చెక్ రిపబ్లిక్) 6-7, 7-5, 6-2 తో అరంజటా శాంచెజ్ వికారియో పై గెలిచారు.