BigTV English

Star Heros : కోలీవుడ్ లో స్టార్స్ గా మారిన తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?

Star Heros : కోలీవుడ్ లో స్టార్స్ గా మారిన తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?

Star Heros : సినిమా అనేది ఒక ప్రపంచం అందులోకి అడుగు పెట్టాలంటే చాలా కష్టం. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు మాత్రం ఒక్క సక్సెస్ అయినా పడుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. సినిమాలు రావడం పెద్ద విషయం కాదు కానీ అదృష్టం ఉంటేనే ఆ సినిమా అందనంత ఎత్తుకు వెళ్తుంది. అలాగే రేంజ్ కూడా స్టార్ రేంజ్ వస్తుంది అని సినీ పెద్దలు అంటుంటారు.. తెలుగులో ముందుగా ఎంట్రీ ఇచ్చి, వేరే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమాతో తమ టాలెంట్ నిరూపించుకోవడంతో పాటుగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోలు ఎందరో ఉన్నారు. అందులో తమిళ్ ఇండస్ట్రీలో మరీ ఎక్కువగా తెలుగు హీరోలే స్టార్స్ గా ఎదిగారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


తెలుగులో మొదటి సినిమా చేసి తమిళ్లో సక్సెస్ అయిన స్టార్స్.. 

అజిత్.. 

తమిళ స్టార్ హీరోలలో ఒకరు అజిత్.. అజిత్ కుమార్ ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను తెలంగాణ లోని సికింద్రాబాద్లో జన్మించాడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు.. తెలుగు సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు. తెలుగులో అప్పట్లో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే ఏమైందో తెలియదు కానీ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోలలో ఈయన ఒకరు. ప్రముఖ నటి షాలినిని పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం సినిమాలతో పాటుగా కార్ రేసింగ్ వంటివి చేస్తూ తెలుగు ప్రేక్షకులు మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు.

ఆది పినశెట్టి.. 

హీరో ఆదిపినశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో విలన్ గా ఈ మధ్య సినిమాలు చేస్తున్నాడు. ఇతను దర్శకుడు రచయితైన రవిరాజా పినిశెట్టి కుమారుడు. అతను నంది పురస్కారం, సిమా పురస్కార విజేత.. 2006లో ఒక ‘వి’ చిత్రం చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. 2009 లో శంకర్ నిర్మించిన ఈరం చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. తెలుగులో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో కూడా తమిళ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు. ఆది పినిశెట్టి వివాహం నటి నిక్కీ గల్రానీతో చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో 2022 మే 18న వివాహం జరిగింది.


జీత్.. 

చందు అనేది 2001లో విడుదలైన రొమాంటిక్ డ్రామా చలనచిత్రం.. వీరు కె. రచించి దర్శకత్వం వహించారు, ఈయన సంగీతాన్ని కూడా సమకూర్చారు. మానేపల్లి మాణిక్యాల రావు నిర్మించిన ఈ చిత్రంలో జీత్ తన సినీ రంగ ప్రవేశంలో ప్రీతితో పాటు అర్చన ప్రధాన పాత్రలు పోషించారు. జీత్ తెలుగులో చేసింది ఒక్క సినిమాని ఆ తర్వాత బెంగాలీ కి వెళ్లి అక్కడ సెటిలైపోయాడు. ప్రస్తుతం అక్కడ స్టార్ హీరోలలో ఈయన ఒకడు.

Also Read :అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

ఇదే కాదు చాలామంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అందులో వైభవ్ రెడ్డి కూడా ఒకడు. ఈయన తెలుగులో సినిమాలు చేస్తూ కోలీవుడ్ కి మకాం మార్చాడు. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా ఉన్నారు..

 

Related News

Teja sajja: ఐఫాలో చిరు, బాలయ్య పై తేజ సజ్జా సెటైర్స్.. దెబ్బకు క్లారిటీ!

Bigg Boss: బిగ్ బాస్ కు కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసా?

Tollywood: పెళ్లి చేసుకోమని వేధిస్తున్న అభిమాని.. దెబ్బకు హీరోయిన్ ఏం చేసిందంటే?

Tejeswi Madivada : బిగ్ బాస్ లో చేసిన ఆ మిస్టేక్ వల్లే ఇండస్ట్రీకి దూరమాయ్యాను.. తేజు షాకింగ్ కామెంట్స్..

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

Big Stories

×