Travis Head To PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament) కోసం ఇప్పటి నుంచే పది ఫ్రాంచైజీలు సంసిద్ధం అవుతున్నాయి. ఏ ప్లేయర్ ను అంటి పెట్టుకొని ఉండాలి.. ? ఎవరిని వేలంలో వదిలేయాలి ? అనే దాని పైన కసరత్తులు చేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad team) యాజమాన్యానికి ట్రావిస్ హెడ్ (Travis Head) ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament) నేపథ్యంలో హైదరాబాద్ తరఫున ఆడకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ లోకి (Pakistan Super League 2027 Tournament) వెళ్లేందుకు ట్రావిస్ హెడ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన ఫ్రాంచైజీ లతో టచ్ లో కి వెళ్ళాడట. రేటు కుదిరితే… వెంటనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ బై చెప్పి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ట్రావిస్ హెడ్ ఉన్నాడని అంటున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ పాకిస్తాన్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఉలిక్కిపడుతున్నారు. పెళ్లికి ముందే కావ్య పాప కొంప ముంచుతున్నాడని ట్రావిస్ హెడ్ పై విమర్శలు చేస్తున్నారు.
తమిళనాడుకు సంబంధించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ కావ్య పాప ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నవంబర్ 10వ తేదీన విదేశాలను ఈ ఇద్దరి వివాహం సన్నిహితుల సమక్షంలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ నెల 21వ తేదీ చాలా గ్రాండ్ గా చెన్నై వేదికగా రిసెప్షన్ మాత్రం నిర్వహించేందుకు కళానిధి మారన్ సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే కార్డ్స్ కూడా ప్రింట్ చేసి ప్రముఖులకు పనిచేశాడు. ఇప్పటికే అనిరుద్ తో పాటు కావ్య పాప ఇంట పెళ్లి సందడి మొదలైంది.
ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును వీడు ఎందుకు ట్రావిస్ హెడ్ సిద్ధమైనట్టు వార్త బయటకు వచ్చింది. దీంతో ఆమె తల పట్టుకుంటున్నారట. అతడు బయటకు వెళ్తే, సన్ రైజర్స్ హైదరాబాద్ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంటుకు సంబంధించిన వేలం గోవా వేదికగా డిసెంబరు 16వ తేదీన జరగనుంది. నవంబర్ 15వ తేదీ లోపు రిటెన్షన్, రిలీజ్ లిస్ట్ ఐపీఎల్ కౌన్సిల్ ఇవ్వాలని 10 ఫ్రాంచైజీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.