Irfan Pathan On Bhuvneshwar Kumar: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా (New Zealand vs India) మధ్య జరిగిన ఐదు టీ20ల సిరీస్ నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఈ టోర్నమెంట్ లో మొత్తం నాలుగు మ్యాచ్ లో ఆడిన భువనేశ్వర్ కుమార్ ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఏకంగా 180 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్ తీసుకోవాలని చాలా మంది చురకలు అంటిస్తున్నారు. అయితే దీనిపై ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించారు. అనవసరంగా భువనేశ్వర్ కుమార్ ను న్యూజిలాండ్ సిరీస్ కు సెలెక్ట్ చేశారని ఫైర్ అయ్యాడు. ఇంత చెత్త ప్రదర్శన కనబరిచిన భువనేశ్వర్ కుమార్ వెంటనే రిటైర్మెంట్ తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ సందర్భంగా భువనేశ్వర్ కుమార్ విఫలం కావడంపై ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అనవసరంగా టీమిండియా టీ20 జట్టులోకి భువనేశ్వర్ కుమార్ ను తీసుకొని సెలెక్టర్లు పెద్ద తప్పు చేశారని ఆగ్రహించాడు. ఇలా భువనేశ్వర్ కుమార్ ఆడతాడని ఎవరు ఊహించలేదని.. ఇలాంటి ప్రదర్శన ఏ మాత్రం సెట్ కాదన్నాడు. న్యూజిలాండ్ గడ్డపై మొదటి మూడు మ్యాచ్ లు అద్భుతంగా టీమిండియా ఆడిందని మెచ్చుకున్నాడు. కానీ చివరి రెండు మ్యాచ్ ల్లో అందరూ విఫలమై ఓడిపోయారని మండిపడ్డాడు.
సిరీస్ గెలిచామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపించిందని ఆగ్రహించాడు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ను ఈ టి20 సిరీస్ లో తీసుకుని బీసీసీఐ పెద్ద తప్పు చేసిందని మండి పడ్డాడు. అతడు ఎంత గొప్ప బౌలరో తనకు బాగా తెలుసు… కానీ ప్రస్తుత పరిస్థితులలో అతడు రాణించలేడని ఇప్పుడు తెలిసిందని వివరించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న క్రమంలో టీ20లలోకి భువనేశ్వర్ కుమార్ ను తీసుకుని పెద్ద మిస్టేక్ చేశారని ఆగ్రహించాడు. అతడిని వన్డేల్లోకి తీసుకోవాలి తప్ప టి20లకు పనికిరాడంటూ సీరియస్ అయ్యాడు.
న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన టి20 సిరీస్ నేపథ్యంలో విఫలమైన భువనేశ్వర్ కుమార్ అండ్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నాలుగు సంవత్సరాల తర్వాత అవకాశం వస్తే భువనేశ్వర్ కుమార్ వినియోగించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. అతడి ఏజ్ అయిపోయిందని ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే మరికొంతమంది అతనికి వన్డేల్లో అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో అతను బాగా రాణిస్తాడని పేర్కొంటున్నారు.