E-Paper
Advertisement

ఇషాన్ కిష‌న్ క్యాచ్ వివాదం…టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ ట్రోల్స్ !

ఇషాన్ కిష‌న్ క్యాచ్ వివాదం…టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ ట్రోల్స్ !
Advertisement

Ishan Kishan- Finn Allen Catch Attempt:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదో టీ20లో ఇషాన్ కిషన్ క్యాచ్ వివాదంగా మారింది. మిచెల్ శాంట్న‌ర్ వేసిన ఓ బంతిని సిక్సర్ కోసం ఇషాన్ కిషన్ ప్రయత్నించాడు. దీంతో సిక్సర్ గేట్ దగ్గర ఫిన్ అలెన్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఇషాన్ కిష‌న్‌ పెవిలియన్ కు వెళ్లిపోవడం గ్యారంటీ అని న్యూజిలాండ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఇంతలోనే థర్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించడంతో కంగు తిన్నారు. దీంతో ఈ క్యాచ్ పై వివాదం రాజుకుంది. ఈ క్ర‌మంలో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి.

ఇషాన్ కిష‌న్ క్యాచ్ వివాదం..టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ ట్రోల్స్ !

హామిల్టన్ వేదికగా మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఐదవ టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన టీమ్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన టీమిండియా, 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 61 పరుగులు సాధించి ఇరగదీశాడు.

Advertisement

ఈ మ్యాచ్ లో ఏడవ ఓవర్ వేసేందుకు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్న‌ర్ బౌలింగ్ కు దిగాడు. ఆ సమయంలో 30 పరుగులతో మంచి టచ్ లో ఉన్నాడు ఇషాన్ కిషన్. ఇక శాంట్న‌ర్‌ వేసిన తొలి బంతిని సిక్స‌ర్ కోసం ప్రయత్నించాడు. సిక్సర్ గేట్ దగ్గర ఉన్న అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో అందరూ ఇషాన్ కిషన్ ఔట్ అయిపోయాడని అనుకున్నారు. కానీ క్యాచ్ పట్టుకునే క్రమంలో బౌండరీ లైన్ ను అతడి కాలు తగిలింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

టీమిండియాకు మూడు లైఫ్ లు

Advertisement

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదవ టీ20 సందర్భంగా టీమిండియాకు మూడు లైఫ్ లు వచ్చాయి. 30 పరుగుల వద్ద ఉన్న ఇషాన్ కిషన్ సిక్సర్ కోసం ప్రయత్నించగా నేరుగా ఫిన్ అలెన్ చేతిలో బంతి పడింది. కానీ దాన్ని సరిగ్గా పరిశీలించిన అంపైర్ నాటౌట్ గా ప్రకటించేశాడు. అయితే, ఈ మ్యాచ్ పై విమ‌ర్శ‌లు వస్తున్నాయి. అంపైర్లు అమ్ముడు పోయారని, టీమిండియాకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారంటూ కివీస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అటు శ్రేయస్ అయ్యర్ కూడా అర్థ సెంచరీకి చేరువలో ఉండగా భారీ షాట్ ఆడగా, బంతికి గాల్లోకి ఎగిరింది. కానీ న్యూజిలాండ్ ఫీల్డర్ల వైఫల్యంతో లైఫ్ దక్కింది. ఆ తర్వాత తిలక్ వర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. అది కాస్త నో-బాల్ గా ప్రకటించేశాడు అంపైర్. దీంతో టీమిండియాకు మూడు లైఫ్ లు దక్కాయి.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

 

Related News

ఇండియా దాటితే, కుక్క కూడా క్రికెట‌ర్ల‌ను ప‌ట్టించుకోదు..లలిత్ మోడీ సంచ‌ల‌నం!

మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్‌లో హార్దిక్ పాండ్యా ఊచకోత…రూ.94.91 ల‌క్ష‌ల ప్రైజ్ మనీ

అల్లా మీద ఒట్టు… 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా షాహీన్ అఫ్రిది అందుకుంటాడు

ట్రై సిరీస్ గెలిచిన పాక్…టీమిండియాకు ఇంజమామ్ వార్నింగ్

పొట్టోడా అంటూ బ‌వుమాను ట్రోల్ చేశారు..ఇప్పుడు వాడే తొక్కితే ఆస్ట్రేలియా ప్లేయర్లు పాతళంలో పడ్డారు

గ‌ల్లీ క్రికెట్ పై ట్వీట్ చేస్తావా? కొంచెమైనా సిగ్గుండాలి..పాక్ ప్ర‌ధాని ష‌రీఫ్ పై అకాశ్ చోప్రా సీరియ‌స్‌

చిచ్చు పెట్టిన అబ్రార్ అహ్మ‌ద్..గిల్ న‌న్ను మోసం చేశాడంటూ లేడీ ర‌చ్చ !

Big Stories

Advertisement
×