E-Paper
Advertisement

నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది
Advertisement

Shahid Afridi On Abhishek Sharma:  న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఇరగదీస్తున్నాడు. మూడో టీ20లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు.. నా కంటే అభిషేక్ శర్మ భయంకరంగా ఆడుతున్నాడని..ప్రతీ సిక్సర్ స్టేడియం అవతలే పడుతోంది అంటూ వ్యాఖ్యానించాడు. తాను కూడా గతంలో టీమిండియాపై భయంకరమైన ఇన్నింగ్స్ ఆడానని తెలిపాడు. ఇప్పుడు అభిషేక్ కూడా అలాగే రెచ్చిపోతున్నాడని చెప్పాడు. ఇలాంటి ప్లేయర్లు అరుదుగా లభిస్తారని, అభిషేక్ శర్మను టీమిండియా బాగానే వాడుతోందని చెప్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అభిషేక్ శర్మ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ గా మారిపోయాడని, వెల్లింగ్టన్ వేదికగా సెంచరీ బాది విమర్శకుల నోర్లు మూయించాడని మెచ్చుకున్నాడు. అభిషేక్ శర్మ ప్రతీ షాట్ సిక్సర్ కోసమే కొడుతున్నట్టు పేర్కొన్నాడు. దీంతో అభిషేక్ శర్మపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అభిషేక్ శర్మ బ్యాట్లు చెక్ చేయాల్సిందే!

అభిషేక్ శర్మ సెంచరీ చేసిన నేపథ్యంలో మెచ్చుకున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, సెటైరికలు కామెంట్స్ కూడా చేశాడు. చాలా మంది అభిషేక్ శర్మ వాడే బ్యాట్లపై అనుమానాలు ఉన్నట్టు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ విషయంలో తనకు కూడా ముందు నుంచే డౌట్ ఉందన్నాడు. ఈ తరుణంలోనే అభిషేక్ శర్మ బ్యాట్లను కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. అప్పుడే అభిషేక్ శర్మ నిజస్వరూపం బయట పడుతున్నాడని స్పష్టం చేశాడు షాహిద్ అఫ్రిది. భారత దేశంలోని ఫ్లాట్ పిచ్ లపైనే ఆడే అభిషేక్ శర్మ, న్యూజిలాండ్ గడ్డపై ఆడితే ప్రతీ ఒక్కరికీ డౌట్ వస్తుందని తెలిపాడు. ఈ తరుణంలోనే చాలా మంది అభిషేక్ సెంచరీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ తరుణంలోనే జై షా వెంటనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అభిషేక్ శర్మపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని తెలిపాడు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

వైభవ్ సూర్యవంశీపై షాహిద్ అఫ్రిది సంచలనం

వైభవ్ సూర్యవంశీపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన మూడో టీ20 సందర్భంగా అభిషేక్ సెంచరీ చేయడంతో వైభవ్ సూర్యవంశీ తేలిపోయాడని వెల్లడించాడు. ఇకపై అలా జరుగకుండా అభిషేక్ శర్మను డామినేట్ చేయాలని వైభవ్ సూర్యవంశీకి సూచనలు చేశాడు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

Related News

SRHలోకి హార్దిక్ పాండ్యా..ఆ రూ. 20 కోట్ల ప్లేయర్‌ను గెంటేసిన కావ్య పాప ?

టెస్ట్ క్రికెట్ కు బుమ్రా ప‌నికిరాడు..గాయాలే అత‌డి కొంప‌ముంచుతున్నాయ్!

నువ్వు స్లాగ‌ర్ కాదు, రియ‌ల్ హీరో…అభిషేక్ శ‌ర్మ‌కు పాక్ బౌల‌ర్ క్ష‌మాప‌ణ‌లు

అభిషేక్, తిల‌క్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్లు..వాళ్లే లేక‌పోతే, టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

శుభమాన్ గిల్ త‌ల‌కు ఏమైంది? ఆ ఎల‌క్ట్రిక్ డివైజ్ ఎందుకు పెట్టుకున్నాడు

బంతులు వేస్తే, బ్యాట‌ర్ల ముక్కు, ద‌వ‌డ‌ల‌ నుంచి ర‌క్తం రావాలి…షోయ‌బ్ అక్తర్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×