WCL 2025 : సాధారణంగా క్రికెట్ ఎప్పుడూ ఏ ఆటగాడు ఫామ్ లో కొనసాగుతాడో చెప్పడం చాలా కష్టం. మొన్న సెంచరీ చేసిన వ్యక్తి.. ఇవాళ కూడా సెంచరీ చేస్తాడంటే ఎవ్వరూ నమ్మరు. మొన్ననే చేశాడు. ఇవాళ చేయకపోయినాడు.. రోజు చేస్తాడా..? అనే రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి. చేస్తే.. హాఫ్ సెంచరీ చేస్తాడేమో వరుసగా సెంచరీలు చేయడం అంటే.. మామూలు విషయమా..? అని రకరకాలుగా చర్చించుకోవడం విశేషం. ముఖ్యంగా సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్, ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో తనదైన స్టైల్‌లో చెలరేగిపోతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించి.. ఈ టోర్నీలో వరుసగా రెండో శతకాన్ని తన ఖాతాలో వేసుకోవడం విశేషం.
Also Read : IND Vs ENG 4th Test : భారత్ అద్భుత పోరాటం.. మ్యాచ్ డ్రా
మిస్టర్ 360..తగ్గేదే లేదు..
“మిస్టర్ 360″గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా తన బ్యాటింగ్ పదును తగ్గలేదని మరోసారి నిరూపించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన డివిలియర్స్, బ్రెట్ లీ, పీటర్ సిడిల్ వంటి లెజెండరీ బౌలర్లను సైతం ఊచకోత కోశారు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, ప్రేక్షకులందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 46 బంతుల్లో 15 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 123 పరుగులు చేసి, సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్‌కు భారీ స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించారు. డివిలీయర్స్ ఈ టోర్నీలో సాధించిన రెండో సెంచరీ. దీనికంటే ముందు ఇంగ్లాండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 41 బంతుల్లోనే అజేయంగా 116 పరుగులు చేసి తన బ్యాటింగ్ సత్తాను చాటారు. ఆ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ 153 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.2 ఓవర్లలోనే ఛేదించడంలో డివిలియర్స్ ఇన్నింగ్స్ కీలకమైంది. 15 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆయన విధ్వంసం సృష్టించారు.
డివిలీయర్స్ టాప్
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 లో డివిలియర్స్ ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతోంది. నాలుగు ఇన్నింగ్స్‌లలో 151.5 సగటుతో 303 పరుగులు చేసి, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో ఆయన జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఆయన అద్భుత ప్రదర్శనతో సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఏబీ డివిలియర్స్ ఆటను చూడటానికి చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న అభిమానులకు, ఈ WCL 2025 ఒక పండుగలా మారింది. 41 ఏళ్ల వయస్సులోనూ ఆయన చూపించే చురుకుదనం, వినూత్న షాట్లు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. “రిటైర్మెంట్ అంటే ఏంటి?” అన్నట్లుగా ఆయన బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి, మరిన్ని మ్యాజిక్ ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించాలని అంతా కోరుకుంటున్నారు. WCL లో డివీలియర్స్ తో పాటు క్రిస్ గేల్ కూడా తన సెంచరీతో రెచ్చిపోయాడు. గతంలో వీరిద్దరూ సిక్స్ కొట్టడంలో పోటీ పడేపడేవారు. ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్ లో బ్యాటింగ్ చేసేవారు.