BigTV English

Abhishek Sharma: హే హే కొట్టు..టీమిండియాలో మరో సెహ్వాగ్.. ఇక టెస్టుల్లోకి ఎంట్రీ ?

Abhishek Sharma: హే హే కొట్టు..టీమిండియాలో మరో సెహ్వాగ్.. ఇక టెస్టుల్లోకి ఎంట్రీ ?

Abhishek Sharma:  ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5వ టీ 20 మ్యాచ్ లో  అభిషేక్ శర్మ అద్భుత సెంచరీ చేసాడు. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో 5 టీ20ల సిరీస్ లను ఒక కైవసం చేసుకుంది. ఇది సాధారణ విషయం కాదు. ఏకంగా 150 పరుగుల తేడాతో భారత్ ఇంగ్లాండ్ ను ఓడించింది. దీంతో భారత్ సిరీస్ 4-1 తేడాతో గెలుచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 భారీ స్కోర్ చేసింది. టి20లో పరుగుల పరంగా భారత్ కు ఇదే అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు.


Also Read: IND VS ENG ODI: కొత్త జెర్సీలో టీమిండియా… రోహిత్ శర్మకు ఘోర అవమానం!

అభిషేక్ శర్మ ఎదుర్కొన్న ప్రతి బంతికి వాంకడే స్టేడియం దద్దరిల్లింది. ప్రతి బంతిని స్టాండ్స్ లోకి పంపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అభిషేక్ ఊచకోతకు డగౌట్ లో కూర్చున్న గంభీర్ తో సహా ఇతర క్రికెటర్లు చప్పట్లతో మోతలు మోగించారు. కేవలం 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 135 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అంతర్జాతీయ టి20లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన మూడవ బ్యాట్స్మెన్ గా నిలిచాడు.


 

అంతేకాదు అంతర్జాతీయ టి20లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డు కూడా అభిషేక్ పేరిట నమోదు అయింది. అంతకుముందు ఈ రికార్డు గిల్ పేరిట ఉండేది. 2023 జనవరిలో అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ పై గిల్ 126 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ ఈ భారీ ఇన్నింగ్స్ తో రోహిత్ రికార్డుకు చేరాడు. అభిషేక్ 37 బంతుల్లో సెంచరీ సాధించగా…. 17 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ తర్వాత టి20లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్మెన్ గా అభిషేక్ శర్మ నిలిచాడు. రోహిత్ 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇంకా చెప్పాలంటే అభిషేక్ శర్మ కొట్టిన 11వ సిక్సర్ తో టి20 లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్మెన్ గా నిలిచాడు.

Also Read: Revanth – Trisha: త్రిష కు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

ఇంతకుముందు ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు రోహిత్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మల పేరిట ఉంది. ముగ్గురు ఒక ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు కొట్టారు. తాజాగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా తన పొగడ్తలతో అభిషేక్ శర్మను ముంచెత్తాడు. టీమిండియాకు మరో సెహ్వాగ్ దొరికినట్లేనని కితాబు ఇచ్చాడు. త్వరలోనే టెస్ట్ జట్టులో చోటు దక్కుతుందని చెప్పాడు. మెరుపు ఇన్నింగ్స్ తోనే కాకుండా స్పిన్ టాలెంట్ ను చూపిస్తున్నాడని చెప్పాడు. యువ ప్లేయర్ లో మంచి లెగ్ స్పిన్నర్ ఉన్నాడని అన్నాడు. అయితే బౌలింగ్ లో నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని అన్నాడు. బౌలర్ గా మరింత ప్రాక్టీస్ అవసరమని చెప్పాడు. కష్టపడే తత్వం అభిషేక్ శర్మలో ఎక్కువగా ఉందని చెప్పాడు. బ్యాటింగ్ లో మరింత సాధన చేస్తాడని అన్నాడు. మరింతగా ఎదుగుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. మొత్తంగా అభిషేక్ శర్మ పేరు మార్మోగిపోతోందని చెప్పవచ్చు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×