IND VS ENG ODI: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరో రసవత్తర పోరు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6వ తేదీ అంటే రేపటి నుంచి టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య… వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. 3 వన్డేల్లో… టీమిండియా అలాగే ఇంగ్లాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టుపైన టి20 సిరీస్ గెలిచింది టీమిండియా. 4-1 తేడాతో 5 t20 ల సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా ( Team India) . స్వదేశంలో జరగడంతో టీమిండియా సులభంగా ఈ సిరీస్ గెలవగలిగింది.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఆస్ట్రేలియా కు ఎదురు దెబ్బ.. ఆ ప్లేయర్ దూరం!
ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందు…. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 3 వన్డేల సిరీస్ కూడా జరగబోతుంది. ఇక రేపటి నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. టీమిండియా వర్సెస్ ఇండియా మధ్య మొదటి వన్డే మ్యాచ్… నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే రెండు జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి.
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్లు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం కానున్నాయి. అంటే మధ్యాహ్నం ఒకటి గంట సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కోసం… మళ్లీ సీనియర్ ప్లేయర్లు బరిలోకి దిగబోతున్నారు. ఈ వన్డే టోర్నమెంట్ కు రోహిత్ శర్మ ( Rohit Sharma ) కెప్టెన్గా వ్యవహరించడున్నాడు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు సంబంధించిన వన్డే జెర్సీని తాజాగా విడుదల చేశారు.
వన్డే జెర్సీలో టీమిండియా ప్లేయర్ లందరూ ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. టి20 ల కంటే ఈ జెర్సీ కొత్త డిజైన్ లో ఉంది. అయితే కొత్త జెర్సీ ( Team India Jersy ) ధరించిన వారిలో… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం లేడు. దీంతో రోహిత్ శర్మ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. అందరి ఫోటోలు రిలీజ్ చేశారు కానీ మా టీమ్ ఇండియా కెప్టెన్ ఎక్కడ అని రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా బీసీసీఐ పాలక మండలిని ప్రశ్నిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ కొత్త జెర్సీనే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో కూడా… టీమిండియా ప్లేయర్లు ధరించబోతున్నారు. ఇంగ్లాండు తో జరిగే వన్డే సిరీస్ అలాగే ఛాంపియన్ ట్రోఫీలో ఈ కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్లు దర్శనం ఇవ్వబోతున్నారన్నమాట. టి20 జెర్సీ కంటే ఈ జెర్సీ చాలా భిన్నంగా ఉంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. పాకిస్తాన్ అలాగే యూఏఈ వేదికలుగా ఈ భారీ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే ఐసీసీ అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
Also Read: SRH: ఒకటి కాదు 5 బుల్డోజర్లు.. గట్టు దాటితేనే వేసేస్తాం… భయంకరంగా మారిన SRH టీం?
— BCCI (@BCCI) February 5, 2025