BigTV English

Abhishek Sharma : అభిషేక్ భారీ సిక్సర్.. కారు అద్దం బద్దలు

Abhishek Sharma : అభిషేక్ భారీ సిక్సర్.. కారు అద్దం బద్దలు

Abhishek Sharma :  సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గత సీజన్ నుంచి తాను అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో అతడు టీ-20 వరల్డ్ కప్ లో సైతం ఆడాడు. అయితే తాజాగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ వర్మ 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అయితే ఈ విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ కొట్టినటువంటి ఓ భారీ సిక్సర్ తగిలి కారు అద్దాలు పగిలిపోయాయి. ఇన్నింగ్స్ 2 వ ఓవర్ లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని అభిషేక్ శర్మ డీప్ మిడ్ వికెట్ మీదుగా కొట్టాడు.


Also Read :  Ban on CSK – RR : 2016, 2017 లో రాజస్థాన్, CSK పై బ్యాన్.. కారణం ధోని కుట్రలేనా?

ఇక అది నేరుగా POTS కారు పై పడింది. దీంతో కారు ఫ్రంట్ గ్లాస్ మొత్తం పగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిషేక్ శర్మ ఆడిండంటే హైదరాబాద్ మ్యాచ్ పక్కాగా గెలుస్తుంది. కానీ ఇవాళ భారీ స్కోర్ మాత్రం చేయలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మాత్రం 94 పరుగులు చేసి సన్ రైజర్స్ స్కోర్ పెంచాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 17 పరుగులు చేశాడు. క్లాసెన్ 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అంకిత్ వర్మ 9 బంతుల్లో 24 పరుగులు, నితిష్ రెడ్డి 4 పరుగులు, అభినవ్ మనోహర్ 12, కెప్టెన్ కమిన్స్ 13 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది హైదరాబాద్ జట్టు. అలాగే 6 వికెట్లను కోల్పోయింది.


భువనేవ్వర్ కుమార్ 1, ఎంగిడి 1, సూర్య శరమ 1, క్రునాల్ పాండ్యా 1, షెఫర్డ్ 2 వికెట్లు తీశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే ప్లే ఆప్స్ కి చేరుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఇది నామమాత్రపు మ్యాచ్ కావడం విశేషం. ఇక రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 43, సాల్ట్ 62 పరుగులు చేశారు. ప్రారంభంలో 10 ఓవర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లు అద్బుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. 10వ ఓవర్ నుంచి 16 ఓవర్ వరకు టప టప వికెట్లు పడ్డాయి. దీంతో కాస్త వెనుకంజకి వెళ్లింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. దీంతో మొదటి స్థానానికి చేరుకుంటుందన్న బెంగళూరు ఆశలపై  హైదరాబాద్ నీళ్లు చల్లింది.  ప్లే ఆప్స్ కి చేరుకున్న జట్లకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. నిన్న గుజరాత్ టైటాన్స్ కి లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు షాక్ ఇచ్చింది. దీంతో వీటి స్థానాలు మారకుండా యధావిధిగా కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా ఈ సారి ఫైనల్ కి ఏ జట్టు పోతుందనేది ముందే ఊహించడం చాలా కష్టం అనే చెప్పాలి.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×