Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుండి థియేటర్లు మూసివేస్తున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద కుట్ర కోణం జరుగుతుందని సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల టైం లో, కావాలని ఓ నలుగురు సినిమాను అడ్డుకొని ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగా ఇప్పుడు థియేటర్లు మూసి వేయించాలనే వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. తాజాగా ఈ వార్తపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఆ వివరాలు చూద్దాం..
పవన్ ను టార్గెట్ చేసిన ప్రొడ్యూసర్స్..రంగంలోకి ఏపీ ప్రభుత్వం..
పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు సినిమా అడ్డుకోవడంలో ఆ ముగ్గురు టార్గెట్ చేశారు. సినిమాని అడ్డుకోవడంలో ఆ ముగ్గురి ప్రొడ్యూసర్స్ పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సమస్యను క్లియర్ చేయడానికి ఏపీ మినిస్టర్ కందుల దుర్గేష్ రంగంలోకి దిగారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలి అని నిర్ణయం తీసుకోవడంపై, వారి హస్తం ఉన్నట్లుగా, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని,పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కి దిశా నిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఇలాంటి నిర్ణయం ఆ నిర్మాతల ఒత్తిడితో ఎగ్జిబిటర్ల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి,హోం శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు.ఈ పరిణామాలతో ఎగ్జిక్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టల్లా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని మంత్రి స్పష్టం చేశారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా,ఎన్ని సినిమాలు ప్రభావం అవుతాయి ఎంత టాక్స్ రెవెన్యూ కి విఘాతం కలుగుతుంది. అనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నట్లు సమాచారం.
ఆ సినిమా ను టార్గెట్ చేసారా ..
తెర వెనుక రాజకీయంతో, వెండితెరపై వినోదాన్ని ప్రేక్షకులకు దూరం చేయాలని, హీరోను ఇబ్బంది పెట్టాలని ఆ నలుగురు భావిస్తున్నారు. కానీ వారు అనుకున్నది సాధ్యం అయ్యేలా కనిపించట్లేదు. ఇది సోషల్ మీడియా కాలం. ఎవరు ఎలాంటి విన్యాసాలు చేసినా ప్రజలు క్షణాల్లో కనిపెట్టగలరు.హరిహర వీరమల్లు అడ్డుకోవడం వెనుక ఎవరు ఉన్నారనేది, ఇప్పుడు థియేటర్లు మూసివేత వెనుక ఎవరు ఉన్నారనేది ప్రజలకు స్పష్టంగా రేపటి రోజున తెలియనుంది.
థియేటర్లు బంద్ పై…
జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నట్లు, కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు చెప్పిన విషయం తెలిసిందే, అద్దె ప్రతిపాదనలో థియేటర్లలో సినిమాలు ప్రదర్శించడంతో, వారికి ఆదాయం సరిపోవడంలేదని నష్టం కలుగుతుందని మల్టీప్లెక్స్ తరహాలో, పర్సంటేజీ ఇవ్వాలని అద్దె ప్రతిపాదన రద్దు చేయాలని, ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఒకసారి ఎగ్జిబిటర్లతో, డిస్ట్రిబ్యూటర్లతో, నిర్మాతలు సమావేశం అయ్యారు. ఇక మరోసారి శనివారం భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం థియేటర్లు బంద్ పై తుది నిర్ణయం ప్రకటించనున్నారు.