BigTV English

Afghanistan Captain Rashid Khan: ఈ ప్రపంచకప్ ని మరిచిపోలేం: ఆఫ్గాన్ కెప్టెన్ రషీద్..!

Afghanistan Captain Rashid Khan: ఈ ప్రపంచకప్ ని మరిచిపోలేం: ఆఫ్గాన్ కెప్టెన్ రషీద్..!

Afghanistan Captain Rashid Khan About ICC T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఆఫ్గాన్ ఓటమి పాలయ్యింది. అప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లను ఓడించి, సెమీస్ వరకు వచ్చింది. కానీ ఇక్కడ సౌతాఫ్రికాపై అంత పోటీని ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయింది. లోయస్ట్ స్కోరు చేసింది. అయితే మ్యాచ్ అనంతరం ఆఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు.


మా జీవితంలో ఈ టీ 20 ప్రపంచకప్ 2024ని ఎప్పటికి మరిచిపోలేమని అన్నాడు. ఫైనల్ వరకు చేరుకుని ఒక కలను సాకారం చేద్దామని అనుకున్నామని తెలిపాడు. అయితే మా మీద మాకు నమ్మకం కలిగిందని అన్నాడు. ఈ ప్రయాణంలో మా వెన్నంటి ఉండి, మాకు సపోర్ట్ చేసి, మమ్మల్ని నమ్మి, మాపై విశ్వాసం ఉంచిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని తెలిపాడు. తమ జట్టులో అందరూ అద్భుతంగా పోరాడారని కితాబిచ్చాడు. మా టీమ్ పట్ల గర్వంగా ఉందని అన్నాడు. ఈ ఓటమి నుంచి నేర్చుకుని వచ్చే సీజన్ లో మరింత గొప్పగా తిరిగి వస్తామని అన్నాడు.

టాస్ ఓడిపోవడమే మంచిదైంది: సౌతాఫ్రికా కెప్టెన్

ఆఫ్గాన్ తో మ్యాచ్ అనంతరం సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ మాట్లాడాడు. సమష్టి పోరాటంతోనే ఫైనల్‌కు చేరుకున్నామని తెలిపాడు. టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని చెప్పాడు. ఒకవేళ టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిదో నేను కూడా చెప్పలేనని అన్నాడు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ చాలా కఠినంగా ఉందని తెలిపాడు.


Also Read: Yuvraj Singh Tweet Viral: ‘గుడ్ నైట్ బామ్మర్దులూ’.. ఇంగ్లాండ్ ఆటగాళ్లపై యువరాజ్ సెటైరికల్ పోస్ట్..

మా విజయంలో టాస్ దే కీలకపాత్ర అని అన్నాడు. అలా పరోక్షంగా ఆఫ్గాన్ల ఓటమికి టాస్ నిర్ణయమే కారణమని చెప్పాడు. అంతేకాదు వాళ్లు పోరాడలేక ఓడిపోలేదు. పిచ్ కారణంగానే ఓడిపోయారని చెప్పకనే చెప్పాడు. అలాగే లక్ష్య ఛేదనలో డికాక్ వికెట్ పడిన తర్వాత మాకు కొంత ఆందోళన కలిగిందని అన్నాడు. అలాగే మేం బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా అంత ఈజీగా అయితే లేదని అన్నాడు.

ఎలాగైతేనేం విజయం సాధించినందకు ఆనందంగా ఉందని అన్నాడు. ఇక టైటిల్‌కు మరో అడుగు దూరంలో ఉన్నామని అన్నాడు. ఇంతవరకు ఈ చివరి మెట్టుపై నిలిచే అవకాశం రాలేదు. ఇంతదూరం వచ్చాక, ఇక భయపడేది లేదని మార్క్‌రమ్ అన్నాడు.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×