MLA Rivaba Jadeja: టీమిండియా సీనియర్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. జడేజా సతీమణికి మంత్రి పదవి దక్కింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 26 మందితో కొత్త మంత్రి వర్గాన్ని ప్రకటించారు. అయితే ఇందులో హోమ్ మంత్రి హర్ష్ సంఘ్వీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియామకం అయ్యారు. అలాగే రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాకు (MLA Rivaba Jadeja) తొలిసారి మంత్రి పదవి దక్కింది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి మినహా మంత్రులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారిలో ఆరుగురు మాత్రమే మళ్లీ పదవి దక్కించుకున్నారు. ఇందులో రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా ఉన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కీలకంగా మారాయి. తాజాగా గుజరాత్ లో మంత్రివర్గం అంతా కూడా రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మంత్రివర్గం రాజీనామా చేసిన 24 గంటల్లోపే, కొత్త మంత్రివర్గం ఏర్పాటు అయింది. ఈ మేరకు కేంద్ర బిజెపి నుంచి ఆదేశాలు వెళ్లడంతో వెంటనే కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేశారు. ఇందులో ఏకంగా 26 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు హోం మంత్రిగా ఉన్న హర్ష్ సంఘ్వీ ( Harsh Sanghvi) ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త మంత్రివర్గంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా స్థానం సంపాదించుకున్నారు.
జనాల్లో మంచి ఆదరణ పొందిన జడేజా సతీమణి రివాబాకు ఈసారి అవకాశం కల్పించారు. ఇటీవల కాలంలో గుజరాత్ లో వరదలు వస్తే, చాలావరకు ఆమె గ్రౌండ్ లో దిగి సహాయం అందించారు. ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా దగ్గరుండి చూసుకున్నారు రివాబా జడేజా. ఈ నేపథ్యంలోనే ఆమెకు మంత్రి పదవి దక్కింది. గుజరాత్ రాజ్ భవన్ లో గవర్నర్ ఆచార్య దేవ్ రత్ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రిగా హర్ష్ సంఘ్వీ ( Harsh Sanghvi) ప్రమాణ స్వీకారం చేశారు. అతనితో పాటు కొత్త మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో మంత్రుల సంఖ్య ఇప్పటివరకు ఉన్న 16 నుంచి 26 కు పెరిగింది. 182 మంది సభ్యులు ఉండే గుజరాత్ అసెంబ్లీలో గరిష్టంగా 27 మంది మంత్రులు ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 26 కు చేరుకుంది. ఇక తన సతీమణి రివాబా జడేజాకు (MLA Rivaba Jadeja) తొలిసారి మంత్రి పదవి దక్కడంతో రవీంద్ర జడేజా హర్షం వ్యక్తం చేశారు. తన కష్టానికి ప్రతీ ఫలం వచ్చిందని పేర్కొన్నారు.
#WATCH | BJP MLA Rivaba Jadeja takes oath as Gujarat Cabinet minister in Gandhinagar pic.twitter.com/mJzv53J2C0
— ANI (@ANI) October 17, 2025