Harshit Rana : టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మను దారుణంగా అవమానించాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా. రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో అతని ముందే కాలు పైకి ఎత్తి ఫోజ్ ఇచ్చాడు హర్షిత్ రాణా. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హర్షిత్ రాణాకు ఎంత బలుపు రా!
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా మ్యాచ్ రేపు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పెర్త్ స్టేడియం లో ప్రాక్టీస్ చేస్తూ మునిగిపోయారు టీం ఇండియా ప్లేయర్లు. ఈ సందర్భంగా హర్షిత రాణా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. రోహిత్ శర్మ ఎదురుగా ఉండగానే, ఐస్ బాక్స్ పైన కాలు పెట్టి, హీరో రేంజ్ లో ఫోజు ఇచ్చాడు హర్షిత్ రాణా. టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ తీసుకువచ్చిన రోహిత్ శర్మ ముందు ఎవరైనా అణిగి మనిగి ఉండాలి. కానీ హర్షిత్ రాణా మాత్రం సీనియర్ క్రికెటర్లకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని తెలుస్తోంది. రోహిత్ శర్మ ముందు నిలబడి ఉండగానే ఐస్ బాక్స్ పైన కాలు పెట్టి హీరో రేంజ్ లో బిహేవ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.చఇది చూసిన రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలంటే హర్షిత్ రాణాకు గౌరవం లేదని.. ఇలాంటి వాడిని టీమిండియా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత బలుపు ఉంటే అస్సలు కుదరదని హెచ్చరిస్తున్నారు.
టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ కు హర్షిత్ రాణా ఈ మధ్యకాలంలో సెలెక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నియామకం అయిన తర్వాత హర్షిత్ రాణాకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. టెస్టులు, వన్డేలు అలాగే టి20 లు ఇలా ఏ ఫార్మాట్ ఆడినా సరే, ఇదే పరిస్థితి నెలకొంది. తుది జట్టులో అతడు లేకపోయినా, ప్రకటించిన జట్టులో కచ్చితంగా హర్షిత్ రాణా పేరు ఉంటుంది. అయితే దీనిపై ఇటీవల గౌతమ్ గంభీర్ కూడా స్పందించారు. హర్షిత్ రాణాకు మంచి టాలెంట్ ఉందని… అందుకే అతని సెలెక్ట్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. కానీ కొంత మంది అతని టాలెంట్ ను గుర్తించకుండా, హర్షిత్ రాణాపై వ్యూస్ కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు.