RCB Sale: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bengaluru) అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును బలవంతంగా అమ్మేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా ఈ బెంగళూరు జట్టును రెండు బిలియన్లకు అమ్మేసేందుకు పేరెంట్ కంపెనీ డియాగో (Diageo India ) ప్రయత్నాలు చేస్తోందని నేషనల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి. అంటే దాదాపు రూ. 17,859 కోట్లకు విక్రయించేందుకు ముందుకు వచ్చిందని చెబుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( Indian Premier League Tournament) లిక్కర్ బ్రాండ్ల యాడ్స్ పై కేంద్ర ప్రభుత్వం కఠినమైన రూల్స్ తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రూల్స్ కారణంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును నడిపించడం ఆర్థిక భారం అని డియాగో కంపెనీ అమ్మేసేందుకు నిర్ణయం తీసుకుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త బయటకు రావడంతోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు ఇండియాకు సంబంధించిన ప్రముఖ కంపెనీలు కూడా రెడీ అయ్యాయి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును రెండు బిలియన్లకు అమ్మేసేందుకు పేరెంట్ కంపెనీ డియాగో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ కంపెనీ ముందు వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇంకో 100 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేయాలని అదానీ నిర్ణయం తీసుకున్నారట. అయితే అతనితో పాటుఆదార్ పూనావాలా ( సిరం ఇన్స్టిట్యూట్ ) కూడా బెంగళూరు జట్టుపై కన్ను వేసినట్లు చెబుతున్నారు. పార్థ్ జిందాల్ ( Parth Jindal) కూడా ఈ జట్టును కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారట. అలాగే ఢిల్లీకి సంబంధించిన ఒక కంపెనీ, అమెరికాకు సంబంధించిన మరో రెండు ప్రైవేట్ సంస్థలు కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై కన్ను వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎవరు ఎక్కువ బిడ్ వేస్తారో? వాళ్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.