Big Stories

Afridi peace mantra: అఫ్రీదీ శాంతి మంత్రం.. అక్తర్, షమికి ఉపదేశం..

T20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఓటమి తర్వాత పాక్ ప్రధాని, మాజీ ఆటగాళ్లు రోహిత్ సేనను కించపరుస్తూ ట్వీట్లు, కామెంట్లు చేయడం… ఫైనల్లో పాకిస్థాన్ ఓటమి తర్వాత టీమిండియా ఆటగాళ్లు, మాజీలు, అభిమానులు అదే రేంజ్ లో కౌంటర్లివ్వడంతో… ఇరు దేశాల మధ్యా భావోద్వేగ యుద్ధం నడుస్తోంది. దాంతో.. అలాంటివి చేయొద్దంటూ అందరికీ శాంతి మంత్రం ఉపదేశిస్తున్నాడు.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ.

- Advertisement -

సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడిపోగానే… భారత్ కు ఫైనల్ చేరే అర్హత లేదంటూ అక్తర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దీనికి కౌంటర్ గా, పాక్ ఫైనల్లో ఓడిపోయాక… సారీ బ్రదర్. దీనినే కర్మ అంటారు అంటూ షమి ట్వీట్‌ చేశాడు. దీనికి జవాబుగా షోయబ్‌ అక్తర్‌… హృదయం ముక్కలైన ఎమోజీని పోస్ట్ చేశాడు. అక్కడితో ఆగకుండా… చాలా తక్కువ జట్లు మాత్రమే 137 పరుగులను డిఫెండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తాయి… అత్యుత్తమ బౌలర్లు ఉన్న పాక్‌కు కూడా క్రెడిట్‌ ఇవ్వాలన్న హర్షాభోగ్లే ట్వీట్‌ను షేర్‌ చేసిన అక్తర్… దీన్ని తెలివైన ట్వీట్ అంటారు అని కామెంట్ చేశాడు. దాంతో ఇద్దరి మాటల యుద్ధంపై అంతా అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -

అందరికన్నా ఓ అడుగు ముందుకేసిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ… ఇలాంటివి వద్దని ఇద్దరు ఆటగాళ్లకు సూచించాడు. క్రికెటర్లుగా రాయబారులమైన మనం… భారత్, పాక్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలని… ప్రజల్లో విద్వేషాలను వ్యాప్తి చేసేలా ఉండకూడదని అఫ్రీదీ హితబోధ చేశాడు. మనమే ఇలా ఉంటే… చదువుకోని సామాన్యులు ఇంకెలా ప్రవర్తిస్తాడో ఆలోచించాలని కోరాడు. అందుకే మనం బంధాలు నిర్మించాలని… అందులోనూ క్రీడలు కీలక పాత్ర పోషించాలని అఫ్రీది శాంతిమంత్రాన్ని ఉపదేశించాడు. పాక్ భారత్‌తో ఆడాలని కోరుకోవాలి… అలాగే టీమిండియా పాక్‌లో పర్యటించాలని కోరుకుందామంటూ పిలుపునిచ్చాడు. అయితే… సూపర్ -12లో బంగ్లాదేశ్‌పై టీమిండియా గెలవగానే… రోహిత్ సేనను ఎలాగైనా సెమీస్‌ చేర్చాలని ఐసీసీ, బీసీసీఐ కుట్రపన్నాయని అక్కసు వెళ్లగక్కిన అఫ్రీదీ… ఇప్పుడు శాంతిమంత్రం పఠించడంతో… ఓటమి బాధ మీదాకా వస్తేగానీ వైరాగ్యం కలగలేదా? అంటూ భారత అభిమానుులు అఫ్రీదీని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News