EPAPER

140 Year Old Beer Bottle : 140 ఏళ్ల బీరు.. ఒక్క బాటిల్ రూ.4 కోట్లు..

140 Year Old Beer Bottle : 140 ఏళ్ల బీరు.. ఒక్క బాటిల్ రూ.4 కోట్లు..

140 Year Old Beer Bottle : ప్రపంచంలో పురాతన కళాఖండాలు, వస్తువులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వేలంలో కోట్ల రూపాయలు గుమ్మరించి మరీ వాటిని ఎగరేసుకుపోతుంటారు… వాటి మీద ఇష్టం ఉన్న వాళ్లు. ఇక మద్యం కూడా ఎంత పాతదైతే అంత ఎక్కువ ధర అంటూ ఉంటారు… మందుబాబులు. ఇప్పుడో బీరు బాటిల్ ధర ఎంతో వింటే… మందుబాబుల కిక్కు పూర్తిగా దిగిపోవడం ఖాయం.


అల్ సాప్స్ అనే కంపెనీ ఎప్పుడో 140 ఏళ్ల కిందట ఆర్కిటిక్ అలె పేరుతో తయారు చేసిన బీరు… ఇప్పుడు 5 లక్షల డాలర్లకు పైగా పలికింది. అంటే… మన రూపాయల్లో 4 కోట్లు పైమాటే. ఇది ఆల్ టైమ్ హయ్యెస్ట్ రేట్ గా రికార్డు సృష్టించింది. ఆల్కహాల్ 10 శాతం ఉండటమే… ఈ బీరు ప్రత్యేకత.

బీరు బాటిల్‌పైన‌ ఓ లామినేటెడ్ పేపర్ క‌వ‌ర్ ఉంది. దాని మీద చేతితో రాసిన అక్ష‌రాలు, పెస్సీ జి.బోల్‌స్ట‌ర్ అనే పేరుతో సంత‌కం ఉంది. అంతేకాదు… ఈ బీర్ బాటిల్‌ 1919లో నా ద‌గ్గ‌ర ఉంది అని కూడా పేపర్ కవర్ పై రాసి ఉంది. దాన్ని బట్టి… ఆ బీరు బాటిల్ ను 1852లో ధ్రువ ప్రాంతాల‌కు వెళ్లేవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు తెలుస్తోంది.


స‌ర్ ఎడ్వ‌ర్డ్ బెల్‌చ‌ర్ అనే నౌకాద‌ళ అధికారి… ఆర్కిటిక్ చ‌ల్ల‌టి వాతావర‌ణానికి త‌గ్గ‌ట్టుగా బీరు త‌యారు చేయాల‌ని 1852లో అల్‌సాప్స్ కంపెనీని కోరాడ‌ట‌. దాంతో… ఆర్కిటిక్ ధ్రువంలో గ‌డ్డ‌క‌ట్ట‌కుండా… ఈ బీరును ఎక్కువ శాతం ఆల్కహాల్ ఉండేలా… అంటే 10 శాతం ఆల్కహాల్ తో త‌యారుచేశారు. ఈ బీరు బాటిళ్ల‌ను బ్రిటీష్ నౌకాద‌ళ అధికారి, ఆర్కిటిక్ యాత్రికుడు అయిన స‌ర్ జాన్‌ ఫ్రాంక్లిన్, అత‌ని టీం కోసం ఎడ్వ‌ర్డ్ బెల్‌చ‌ర్ ఆర్కిటిక్ ధ్రువానికి పంపారని… ఆ తర్వాత కనిపించకుండా పోయిన ప్రాంక్లిన్ టీమ్ ని కనిపెట్టడానికి వెళ్లిన సహాయక సిబ్బందికి బీరు బాటిళ్లు కనిపించడంతో… వాటిని తీసుకొచ్చారని ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ బాటిళ్లలో ఒకటి వివిధ వ్యక్తుల చేతులు మారి… చివరికి వేలంలో రూ.4 కోట్లకు పైగా పలికింది. దాని ధర విని ప్రపంచవ్యాప్తంగా మందుబాబులు నోరెళ్లబెడుతున్నారు.

Tags

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Cyclone Dana: ‘దానా’ తుపాను ఎఫెక్ట్‌.. పలు రైళ్లతో పాటు ఆ ఎగ్జామ్స్ కూడా రద్దు!

AP Cabinet Meeting: సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం.. మంత్రి నాదెండ్ల మనోహర్‌

Kaleshwaram Investigation: మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు

IAS Officer Amoy Kumar: ఐఏఎస్ అమోయ్ కుమార్ అక్రమాల పుట్ట పగలనుందా? అమోయ్ సొమ్మంతా ఎక్కడ?

Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. కుప్పకూలిన భారీ భవనం.. ఒకరు మృతి

Jagga Reddy: కేటీఆర్‌కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదు.. అంతా బుక్ నాలెడ్జ్.. జగ్గారెడ్డి ఫైర్

Big Stories

×