Telugu Heroes In IPL: క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ మరో 26 రోజులలో ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ మార్చ్ 22న ప్రారంభం అవుతుంది. ఈ తొలి మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ {కేకేఆర్} – రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు {ఆర్సిబి} తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కలకత్తా హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతోంది.
ఇక గత సంవత్సరం రన్నరప్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత రోజు మధ్యాహ్నం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. ఇక మే 25 ఆదివారం రోజున ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతుంది. ఈ మహా సంగ్రామానికి ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది. ఈ సీజన్ లో ఏకంగా తొమ్మిది మ్యాచ్ లు భాగ్యనగరంలో జరగనున్నాయి. ఐపీఎల్ 2025లో 65 రోజులపాటు మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. లీగ్ దశ మే 18న ముగుస్తుంది.
ఇక ప్లే ఆఫ్ మ్యాచ్ లు మే 20 నుండి 25 వరకు జరుగుతాయి. మే 20,21 తేదీలలో క్వాలిఫైయర్ 1, మే 23న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లు జరుగుతాయి. మే 25న ఈడెన్ గార్డెన్స్ లో ఫైనల్ మ్యాచ్. ఇక ఐపీఎల్ 2025 సీజన్ ఇంకా ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో ఐపిఎల్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఇప్పటికే మొదలైంది. అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం. సంవత్సరం మొత్తంలో ఎన్ని టోర్నమెంట్లు ఉన్నా.. క్రీడాభిమానుల ఫోకస్ మాత్రం ఐపీఎల్ పైనే ఉంటుంది.
వేసవిలో ఈ మెగా లీక్ అందించే వినోదం అంతా ఇంతా కాదు. స్థానిక ఆటగాళ్ల నుండి ఇండియా స్టార్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్లు అంతా కలిసి ఆడుతుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలవు. అయితే తాజాగా టాలీవుడ్ హీరోలు కూడా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చారంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇది నిజం అనుకుంటే పొరపడినట్లే. ఐపీఎల్ లోని పలు ఫ్రాంచైజీల జెర్సీలను టాలీవుడ్ హీరోలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ {ఏఐ} ద్వారా క్రియేట్ చేసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు క్రీడాభిమానులు. ఈ ఐపీఎల్ జెర్సీ లతో టాలీవుడ్ హీరోలు తలుక్కున మెరిశారు.
వీరిలో కలకత్తా నైట్ రైడర్స్ జెర్సీలో మాస్ మహారాజా రవితేజ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీలో అల్లు అర్జున్, లక్నో జెర్సీలో రామ్ చరణ్, ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలో విజయ్ దేవరకొండ, రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో నాని, ముంబై ఇండియన్స్ జెర్సీలో రెబల్ స్టార్ ప్రభాస్, గుజరాత్ టైటాన్స్ జెర్సీలో జూనియర్ ఎన్టీఆర్, చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో నందమూరి బాలకృష్ణ, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జెర్సీలో మహేష్ బాబు, సన్రైజర్స్ హైదరాబాద్ జెర్సీలో పవన్ కళ్యాణ్ ఫోటోలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ {ఏఐ} ద్వారా క్రియేట్ చేసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. దీంతో ఐపీఎల్ జెర్సీలలో టాలీవుడ్ హీరోలకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">