Intinti Ramayanam Today Episode February 25 th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఒక ఆఫీస్ కి రిబ్బన్ కట్ చేయడానికి వెళ్తాడు. అవని చూసి మనసులో అవని పై ప్రేమను కురిపిస్తాడు. ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత లోపలికి వెళ్ళగానే ఒక అమ్మాయి అక్షయ్ ని ఎలాగైనా దెబ్బ తీయాలని అనుకుంటుంది. టిప్స్ కోసం అని అడిగి లోపలికి తీసుకెళ్తుంది. తనతో మాట్లాడుతూ నేను మీకు పెద్ద ఫ్యాను మీ బిజినెస్ స్కేల్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి మీరంటే నాకు పిచ్చి ఎక్కువ చేశాయి మీరు నన్ను ఎలా వాడుకున్న పర్లేదు అనేసి ఓపెన్ ఆఫర్ ఇస్తుంది.. కానీ దానికి ఆ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో తనని బలవంతం చేయబోయాడని డ్రామాను మొదలు పెడుతుంది.. అవని ఆ విషయాలని నమ్మదు.. అయితే అక్షయ్ ని అక్కడ ఉన్న వాళ్ళందరూ తిడతారు. మీరు ఎంతో పెద్దమనిషిని మిమ్మల్ని ఇక్కడికి పిలిచాము కానీ మీరు ఇలాంటి చీప్ బిహేవియర్ అని అర్థం కాలేదు అనేసి అతను అనగానే ఆగండి సార్ అని అవని వస్తుంది. నేను ఫ్లవర్ డెకరేషన్ చేసేటప్పుడు అన్ని రూమ్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి చూసాను ఒకసారి ఎవరిని తప్పో చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు అవుతుంది కదా అనేసి అంటుంది. ఇక దానికి అక్కడున్న వాళ్ళందరూ సిసి టీవీ ఫుటేజ్ ని చూడాలని అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి వద్దు చూడద్దు అని అంటుంది ఎందుకు వద్దు అతను చేసిన తప్పే కదా అతని చూసి పోలీసులకు ఈ వీడియో చూపిస్తే అతని అరెస్ట్ చేస్తారు అతని పరువు తీస్తారు అంతే కదా అనేసి అవని అంటుంది.. అక్షయ్ కి సారీ చెప్పమని అవని చెప్తుంది. ఇక అవని అక్షయ్ ఇద్దరు బయటికి వెళ్లిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం పల్లవి శ్రియను ఎలాగైనా పడేయాలని ప్లాన్ చేస్తుంది. భానుమతి వచ్చి ఏం చేస్తున్నావ్ అని పల్లవిని అడగగానే షాక్ అవుతుంది. ప్రియాను మన దారికి తెచ్చుకోవాలని అన్నావు కదా బామ్మ అందుకే ఈ ప్లాన్ వేస్తున్నాను శ్రీను కింద పడేసి దానికి సేవలు చేస్తే అది మన దారికి వచ్చేస్తుంది కదా అని అంటుంది. దానికి భానుమతి శ్రీను పడేయడానికి ఇలాంటి ప్లాన్ వేసావని పల్లవిని అడుగుతుంది నువ్వే కదా అమ్మమ్మ చెప్పావు శ్రీయ అని మన దారిలోకి తెచ్చుకోవాలంటే దాన్ని ఇలా పడేసి మనమే కావాలని కలరింగ్ ఇచ్చి మంచి వాళ్ళమని అనిపించుకోవాలని నేను అనుకున్నాను ఎలా ఉంది ప్లాన్ అనేసి పల్లవి అడుగుతుంది. తాను బాగా అదిరిపోయిందని భానుమతి అంటుంది. శ్రీయ రాగానే ఆ దారం తగులుకొని కింద పడుతుంది.. శ్రీయా అరుపులు విని భానుమతి అలాగే పల్లవి ఇద్దరు అక్కడికొస్తారు ఏమైందంటే కింద పడ్డాను చాలా నొప్పిగా ఉంది పల్లవి అని అంటుంది.. పల్లవి శ్రీయ ముందు మంచిదాన్ని అని శ్రియకు సేవలు చేస్తున్నట్లు నటిస్తుంది. శ్రీయా అది నిజమే అని నమ్ముతుంది. ఇక భానుమతి కూడా పల్లవి మంచితనం గురించి గొప్పగా చెప్తుంది. శ్రియ మనసులో పల్లవిపై మంచి ప్రభావం ఏర్పడుతుంది.. ఇక మొత్తానికి భానుమతి బయటకు రాగానే ఆ శ్రియా పిచ్చి మొహం ది నీ మాయలో పడిపోయిందని పల్లవికి హింట్ ఇస్తుంది.. ఇక అందరూ కలిసి శ్రియ కింద పడిందని బాధపడుతూ ఉంటారు.
రాజేంద్ర ప్రసాద్ ని భోజనం చేయడానికి రండి అనేసి పార్వతి పిలుస్తుంది. అక్షయ్ కూడా రాని అందరం కలిసి భోజనం చేద్దాం అంటే ఇప్పటికే లేట్ అయింది కదండీ మీరు తినేసి టాబ్లెట్ వేసుకోవాలి కదా అని పార్వతి అడుగుతుంది. అప్పుడే అక్షయ్ ఇంట్లోకి వస్తాడు అదిగో అక్షయ వచ్చాడుగా ఇంక మనం అందరం కలిసి భోజనం చేద్దాం అని రాజేంద్రప్రసాద్ అంటాడు. కానీ అక్షయ మాత్రం నేను ఈరోజు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఈరోజు నా పరువును కాపాడారు ఒకరు అనేసి అంటాడు. ఈరోజు నేను ఒక ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి నా మీద ఇష్టంతో తనని నేను పాడు చేసానని ఏదేదో చెప్పేసింది అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చెడ్డగానుకున్నారు కానీ ఒక దేవత నన్ను వచ్చి కాపాడింది లేకున్నా అంటే ఈరోజు నా పరువు ఇంటి పరువు పోయేదని రాజేంద్రప్రసాద్ తో అక్షయ్ అంటాడు.
ఎవర్రా నిన్ను కాపాడిందంటే అవని అక్కడ ఉండి నన్ను కాపాడిందని అక్షయ్ అంటాడు. అవని అక్కడ ఏం చేస్తుంది అని పార్వతి అంటుంది. ఫ్లవరిస్ట్ గా జాబ్ చేస్తుంది. అక్కడ ఆఫీస్ డెకరేట్ చేయడానికి అక్కడికి వచ్చింది. అయితే ఆ సమయంలో ఈ అమ్మాయి నా మీద నిందలు మోపడం చూసి నా భర్త ఎటువంటి తప్పు చేయడని నా మీద నమ్మకంతో ఆ అమ్మాయికి బుద్ధి వచ్చేలా చేసింది అని అనగానే పల్లవి అది విని మళ్లీ అక్షయ మనసులో అనుమానం వచ్చేలాగా మాట్లాడుతుంది. అంత ప్రేమ ఉండేదైతే ఆస్తి మొత్తం ఎందుకు మీ పేరు రాయిస్తుంది అంటే మిమ్మల్ని ఆస్తిని ఎగరేసుకుపోవాలని అనుకుందేమో బావగారు అని అంటుంది. ఇక అక్షయ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. మళ్లీ పార్వతికి అవనిపై చాడీలు చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో అవని శ్రీకర్ పై అనుమానం కలిగించే ప్లాన్ చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..