BigTV English

Maharashtra: ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్.. పాకిస్థాన్ జిందాబాద్, ఆ షాపుపై బుల్డోజర్ చర్య

Maharashtra: ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్.. పాకిస్థాన్ జిందాబాద్, ఆ షాపుపై బుల్డోజర్ చర్య

Maharashtra: దాయాది దేశం పాకిస్థాన్‌తో టీమిండియా క్రికెట్ మ్యాచ్ అంటే చెప్పనక్కర్లేదు. నరాలు తెగిపోయినంత ఉత్కంఠ ఉంటుంది. మైదానంలో ఆటగాళ్లు మాటేమో గానీ, ఈ చిన్న తప్పు చేసినా ప్రేక్షకులు క్షమించరు. ఆటగాళ్లపై నిరసనలు వ్యక్తం చేశారు.. చేస్తున్నారు కూడా. అలాంటి సందర్భాలు ఇండియా, పాకిస్థాన్‌లో కోకొల్లలు.


తాజాగా ఛాంపియన్ ట్రోపీ-2025 ఓ మ్యాచ్ సందర్భంగా ఓ షాపు ఓనర్ పాకిస్థాన్ జిందాబాద్ అని స్లోగన్ చేశాడు. అభిమానులు తట్టుకోలేకపోయారు. చివరకు ఆ మరుసటి రోజు అధికారులు అతడి షాపును బుల్డోజర్‌తో కూల్చివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్దాం.

టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్


పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ -2025 జరుగుతోంది. పాక్‌లో మ్యాచ్ లు ఆడేందుకు భారత్ నిరాకరించింది. దీంతో తటస్థ వేదిక దుబాయిలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆదివారం ఇరు దేశాల కీలకమైన మ్యాచ్ జరిగింది. పాక్ నిర్దేశించిన లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. ఓపెనర్లగా రోహిత్ శర్మ-గిల్ దిగారు.

తొలి ఓవర్ పాక్ బౌలింగ్‌ను గమనించిన హిట్ మ్యాన్ ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. రోహిత్ బౌండరీలకు స్టేడియం అంతా చప్పట్లతో మార్మోగింది. మూడో ఓవర్‌లో షాహిన్ షా ఆఫ్రిది వేసిన బంతి బౌల్డ్ అయ్యాడు. దీంతో స్టేడియం అంతా సైలెంట్ అయ్యింది.

ALSO READ: కెప్టెన్ గా పవన్, ఎందిరా ఈ రచ్చా, ఐపీఎల్ లోకి హీరోలు

మహారాష్ట్రలో ఏం జరిగింది?

సీన్ కట్ చేస్తే.. అసలు విషయానికొద్దాం. ఆ మ్యాచ్ సమయంలో మహారాష్ట్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మాల్వాన్‌లో ఓ ముస్లిం వ్యక్తి స్క్రాప్ నిర్వహిస్తున్నాడు. ఏళ్ల తరబడి వలస వచ్చిన ఆయన, అక్కడే ఉంటున్నాడు. ఆ షాపులో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ను చాలామంది అభిమానులు తిలకిస్తున్నారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ కాగానే, పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఆ షాపు ఓనర్ నినాదాలు చేశారు. కొంతమంది బైక్ ర్యాలీ చేపట్టారు. మ్యాచ్ తిలకించిన ప్రేక్షకులు షాపు ఓనర్ స్లోగన్ విని ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జరిగిన తతంగాన్ని వారంతా పోలీసులకు వివరించారు.

సోమవారం అధికారుల రంగ ప్రవేశం

షాప్ ఓనర్ వ్యవహారం పంచాయితీ చివరకు మాల్వాన్ మున్సిపాలిటీ అధికారుల వరకు చేరింది. ఇంకేముందు సోమవారం ఉదయం బుల్డోజర్ వచ్చి, ఆ షాపును కూల్చేసింది. తొలుత షాపు ఓనర్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. కారణం చెప్పలేదు.

సోషల్ మీడియాలో దుమారం

ఆ చుట్టుపక్కల వచ్చినవారు రాత్రి మ్యాచ్‌లో టీమిండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వల్లే ఈ పని జరిగిందన్నారు. దీంతో షాక్ కావడం ఆయన వంతైంది. ఈ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులుముకుంది. శివసేనకు చెందిన నీలేష్ రాణే ఈ వ్యవహారంపై ఎక్స్‌లో ఫోటోలు, వీడియోలు షేర్ చేశాడు. జాతీయ వ్యతిరేకులపై బుల్డోజర్ చర్య అవసరమా అంటూ ప్రశ్నించేలా రాసుకొచ్చారు.

దీనిపై సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో చిన్నపాటి చర్చ మొదలైపోయింది.  వ్యతిరేకంగా మాట్లాడితే అధికారులు వచ్చి షాపులు కూల్చేవేస్తారా? అంటూ ప్రశ్నలు రైజ్ చేసినవాళ్లు లేకపోలేదు. అధికారుల చర్యను సమర్థిస్తున్నవాళ్లూ లేకపోలేదు.

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×