OTT Movie : కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వా వాతియార్’ మూవీ థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. ఈ సినిమా అనేక వాయిదాల తరువాత ఈ వారం థియేటర్లలోకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘వా వాతియార్’ ట్రైలర్‌ను ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా వీక్షించారు. ఇందులో రాజ్‌కిరణ్‌ను MGR అభిమానిగా, కార్తీని పోలీసుగా చూపించారు. అప్పుడే ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి రాబోతోంది ? ఓటీటీ వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
నలన్ కుమారసామి దర్శకత్వం వహించిన ఈ తమిళ కామెడీ యాక్షన్ మూవీ ‘వా వాతియార్’ డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో కార్తీ, కృతి శెట్టి, సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, GM సుందర్, రమేష్ తిలక్, PL తేనప్పన్ వంటి నటులు నటించారు. సంతోష్ నారాయణన్ దీనికి సంగీతం అందించారు. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్ల విడుదల తరువాతనే ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ అవుతుంది.
ఈ మూవీ MGR (ఎమ్జీ రామచంద్రన్) డై హార్డ్ ఫ్యాన్ తో మొదలయ్యే ఒక హిలేరియస్ జర్నీ. ఇందులో సత్యరాజ్ అనే పాత్ర, MGRకు మోస్ట్ డెవోటెడ్ ఫ్యాన్. అతను తన మనసులో MGR ఒక దేవుడిలా కొలుస్తాడు. పేదలకు సహాయం, కరప్షన్ కు అగైన్ గా ఉంటూ అందరికీ మార్గదర్శి లాగా ఉంటాడు. తన మనవాడిని (కార్తి) పూర్తిగా MGR స్టైల్ లో పెంచుతాడు. చిన్నప్పటి నుంచే MGR మూవీలు చూపించి, అతని స్టైల్‌లో మాట్లాడటం, నడవడం నేర్పుతాడు. కానీ గ్రాండ్‌సన్ పెద్దయ్యాక, అతని స్వభావం మారిపోతుంది. మోడరన్ వరల్డ్‌లో అతను తాతగారి ఐడియల్స్‌తో కాన్ఫ్లిక్ట్‌లో పడతాడు.
Read Also : బెడ్రూంలో ఇదేం పనిరా అయ్యా… అమ్మాయి వెనకే వచ్చి… ఇంటెన్స్ హై ఆక్టెన్ థ్రిల్లర్… యాక్షన్ ప్రియులకు ఐ ఫీస్ట్