Harsha Vardhan: ప్రముఖ నటుడు హర్షవర్ధన్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఈ మధ్యకాలంలో అంటే.. ప్రియదర్శి కోర్టు మూవీ విడుదలకు ముందు నుండి ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక హర్షవర్ధన్ పేరు చెప్పగానే అందరికీ అమృతం సీరియల్ గుర్తుకొస్తుంది. అమృతం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన ఈయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కేవలం కమెడియన్ గానే కాకుండా విలన్ గా అలాగే రైటర్ గా టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్షవర్ధన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై అలాగే వర్మ పై షాకింగ్ కామెంట్లు చేశారు. పెళ్లి ఓ పబ్లిక్ టాయిలెట్ అని , ఆ విషయంలో వర్మ కంటే నేనే తెలివైన వాడిని అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం..
వర్మ కంటే నేనే తెలివైన వాడిని – హర్షవర్ధన్
నటుడు హర్షవర్ధన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో పెళ్లి గురించి మీరు మాట్లాడితే అచ్చం ఆర్జీవి మాట్లాడినట్టే ఉంటుంది అని యాంకర్ అడిగింది. యాంకర్ మాటలకు హర్షవర్ధన్ స్పందిస్తూ.. ఆర్జీవి కంటే పెళ్లి విషయంలో నేనే తెలివైన వాడిని.. ఎందుకంటే ఆయన ఓసారి పెళ్లి చేసుకొని బయటికి వచ్చారు.నేను పెళ్లి చేసుకోకుండానే ఈ విషయాలన్ని చెబుతున్నాను.ఇక ఇంగ్లీష్ లో పెళ్లి గురించి ఓ కొటేషన్ ఉంది. దాన్ని తెలుగులో చెప్పుకుంటే వివాహం అనేది ఒక పబ్లిక్ టాయిలెట్ లాంటిది. అందులో ఉన్న వాడి కంటే పెళ్లి చేసుకున్న వాడికే కంపు ఎక్కువ కొడుతూ ఉంటుంది. బయటికి ఎప్పుడు వెళ్లాలా అని చూస్తూ ఉంటాడు. కానీ బయట ఉన్న వాడికి మాత్రం లోపలి వాడు ఎప్పుడు వస్తాడా.. మనం ఎప్పుడు లోపలికి వెళ్దామా అన్నట్లుగా ఉంటాడు..అంటూ పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేశారు హర్షవర్ధన్.
ఆమె వల్లే పెళ్లిపై విరక్తి – హర్షవర్ధన్..
ఇక హర్షవర్ధన్ మాటలపై చాలామంది ఫైర్ అవుతున్నారు.. వివాహం అనేది ఎంతో గొప్ప బంధం అని, పెళ్ళికాని వాడికి ఈ బంధం విలువ ఏం తెలుస్తుంది అని సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు. కానీ ఎవరి అభిప్రాయం వారిది కాబట్టి హర్షవర్ధన్ పెళ్లిపై ఆ విధంగా మాట్లాడారు. ఇక ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న హర్షవర్ధన్ కి పెళ్లిపై విరక్తి పుట్టడానికి కారణం తాను ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. చాలా సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో సడన్గా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో పెళ్లిపై హర్షవర్ధన్ కి విరక్తి పుట్టిందట.అందుకే ఇంత వయసు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు. ఇక హర్షవర్ధన్ సినిమాల గురించి మాత్రమే కాకుండా సామాజిక అంశాల గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. మొత్తానికైతే పెళ్లి చేసుకోకుండా నేనే కరెక్ట్ చేశాను అంటూ వర్మాని సైతం డామినేట్ చేస్తూ హర్షవర్ధన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
Ram Charan Peddi : ‘పెద్ది’ హిందీ టీజర్ చూశారా? ఆ వాయిస్ ఎవరిదో గమనించారా?