BigTV English

CM Revanth : రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో క‌పిల్ దేవ్ భారీ డీల్ !

CM Revanth : రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో క‌పిల్ దేవ్ భారీ డీల్ !

CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజి బిజీగా ఉన్నారు. ఇవాళ ఢిల్లీకి బయలుదేరిన ఆయన కేంద్ర క్రీడలు, కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తెలంగాణలో క్రీడా యూనివర్సిటీ, ఖేలో ఇండియా పై చర్చించినట్టు సమాచారం. అలాతే తెలంగాణ వేదిక గా అనేక క్రీడలు నిర్వహించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రికి వినతి చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు సినీ, స్పోర్ట్స్  ప్రముఖులు ఢిల్లీలోని తన నివాసంలో కలిశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు ప్ర‌ముఖ హిందీ సినీ నటుడు అజయ్ దేవ‌గ‌ణ్‌.  తెలంగాణ‌లో అంత‌ర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఆస‌క్త‌ి చూపిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఏఐ సాంకేతిక‌త జోడింపుతో వీఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోల ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.


Also Read : Digvesh Rathi : దిగ్వేష్ దరిద్రం చూడండి.. IPL కంటే DPL లోనే ఎక్కువ ధర… ఎంతంటే

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కపిల్ దేవ్.. 


ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు అందజేశారు.  అజయ్ దేవ‌గ‌ణ్‌ తో పాటు తెలంగాణ  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్‌. హైద‌రాబాద్‌లో స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుపై సీఎం, క‌పిల్‌దేవ్ మ‌ధ్య చ‌ర్చ‌లు జరిగాయి. తెలంగాణలో క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకం లభిస్తుందని.. ఇటీవలే క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కి డీఎస్పీ ఉద్యోగాన్ని ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే క్రీడలను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తుండటంతోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కపిల్ దేవ్ కలిసి పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయతో భేటీ అయి.. తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఖేలో ఇండియా, 40వ జాతీయ క్రీడలు నిర్వహణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ఖేలో ఇండియా కింద శిక్షణ, వసతుల అభివృద్ధికి నిధులివ్వాలని.. జాతీయ క్రీడల్లో పాల్గొనే వారికి రైలు ఛార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. 

అక్షయ్.. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్  కీలక చర్చలు.. 

బాలీవుడ్ హీరో అజయ్ దేవ‌గ‌ణ్‌, కపిల్ దేవ్ లతో భేటీతో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో పలు కీలక అంశాల పై చర్చించారు. వీటిలో ముఖ్యంగా భువనగిరిలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, రాయగిరిలో స్విమ్మింగ్ పూల్, మహబూబ్ నగర్ లోని పాలమూరు యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, కరీంనగర్ శాతావాహన యూనివర్సిటీలో మల్టీ పర్పస్ హాల్, హైదరాబాద్ హాకింపేటలో అర్చరీ రేంజ్, సింథటిక్ హాకీ ఫీల్డ్, హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో స్క్వాష్ కోర్టు, నేచురల్ ఫుట్ బాల్ ఫీల్డ్ అభివృద్ధి, సింథటిక్ ట్రాక్, గచ్చిబౌలిలో హాకీ గ్రౌండ్ నవీకరణ, నల్గొండ మహాత్మగాంధీ యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాలకు రూ.100 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మాండవీయను విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 2036లో నిర్వహించే ఒలింపిక్స్ లో కనీసం తెలంగాణలో రెండు ఈవెంట్లు నిర్వహించాలని కేంద్ర మంత్రిని కోరారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరిగా రైలు ప్రయాణాలలో ఛార్జీ రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×