Digvesh Rathi : ఐపీఎల్ స్టార్ క్రికెటర్ దిగ్వేష్ రతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఐపీఎల్ లో కేవలం రూ.30లక్షలకు కొనుగోలు చేశారు. కానీ DPL లో మాత్రం దిగ్వేష్ రూ.38 లక్షలు చెల్లించడం విశేషం. DPL లో అగ్రస్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు సిమర్ జీత్ సింగ్ ని సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.39లక్షలకు కొనుగోలు చేసింది. దిగ్వేష్ ని దక్షిణ ఢిల్లీ.. దిగ్వేష్ కి రూ.38లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఐపీఎల్ రూ.30లక్షలకు అమ్ముడు పోయిన ఆటగాడు.. ఇప్పుడు DPL లో మాత్రం ఐపీఎల్ కంటే ఎక్కువ ధరకు అమ్ముడు పోయాడు. ఐపీఎల్ లో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. ప్రపంచంలో ఐపీఎల్ లో చెల్లించినంతగా మరే లీగ్ లో కూడా చెల్లించరు.
Also Read : MS Dhoni : ధోని ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్తత.. సీరియస్ అయిన సాక్షి.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..!
లెగ్ స్పిన్నర్ కి పెరిగిన డిమాండ్..
అలాంటి ఐపీఎల్ లో తక్కువ ధరకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. కానీ DPL లో మాత్రం ఐపీఎల్ కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయడంతో వైరల్ అవుతోంది. ఎమర్జింగ్ లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రతి ని 2025 ఐపీఎల్ సీజన్ లో రూ.30లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ వేలంలో దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ తరువాత ఈ లెగ్ స్పిన్నర్ కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఎకానమీలో అతను 13 మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీసుకున్నాడు. రిషబ్ పంత్ కెప్టెన్సీలో కీలక బౌలర్ గా కొనసాగాడు. ఐపీఎల్ లో ముఖ్యంగా దిగ్వేష్ రతి బౌలింగ్ చేయడానికి ముందు స్టేడియంలో తాను సిగ్నేచర్ చేశాడు. ఆ తరువాత వేసిన బంతికే రికెల్టన్ ఆయూష్ బదోనికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో దిగ్వేష్ సంబురాలు చేసుకున్నాడు. ఇక దిగ్వేష్ కి సంబంధించిన సిగ్నేచర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
DPL వారికి గొప్ప అవకాశం..
ఇక DPL రెండో సీజన్ కోసం దాదాపు 520 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. డీపీఎల్ లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ వేలానికి ముందు జాంటీ సిద్దూని ఉంచుకుంది. సిమర్ జిత్ సింగ్, యష్ దుల్ వంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మరోవైపు వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. బిగ్ స్టేడియాల్లో ఆటగాళ్లు మెరిసిపోవడానికి DPL ఒక గొప్ప అవకాశమని.. భారత్ లోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఈ లీగ్ ఆటగాళ్లకు గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. గత ఏడాది అద్భుతమైన క్రికెట్ ని చూశాం. ఈ సీజన్ గత ఏడాది కంటే ఎక్కువ ఉత్కంఠ భరితంగా సాగుతుందని భావిస్తున్నట్టు వెల్లడించాడు. ప్రస్తుతం ఇండియాలో పలు లీగ్ లు నిర్వహించడం పట్ల క్రీడాకారులు అందులో పాల్గొనడం వల్ల తమ ప్రతిభ చాటేందుకు గొప్ప అవకాశాలు అనే చెప్పవచ్చు. ఈ లీగ్ ల ద్వారా ఆటగాళ్లకు మంచి గుర్తింపు లభించనుంది.