Ajinkya Rahane Fires On Tilak Varma: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) భాగంగా పాకిస్తాన్ చేతిలో ఆదివారం టీమిండియా జూనియర్ టీమ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ ( Tilak Varma) ఒంటరి పోరాటం చేసినప్పటికీ టీమిండియాకు నిరాశ తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత తిలక్ వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. షహబాజ్ అహ్మద్ (Shahbaz Ahmed ) ఔట్ కాకపోయి ఉంటే టీమిండియా సులభంగా గెలిచేదని తిలక్ వర్మ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశాడు.
పాక్ లో ఓడిన సందర్భంగా తిలక్ వర్మ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అజంక్య రహానే (Ajinkya Rahane Fires On Tilak Varma) ఫైర్ అయ్యాడు. తిలక్ వర్మకు అసలు బుర్ర ఉందా? డ్రెస్సింగ్ రూమ్ లో చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా మాట్లాడుతారా? అంటూ సీరియస్ అయ్యాడు. తోటి ఆటగాళ్లు సరిగ్గా ఆడక పోతే, డ్రెస్సింగ్ రూమ్ లో చర్చించాలని.. దానిపైన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించాడు. అంతేకానీ షాబాద్ అహ్మద్ ను అవమానిస్తూ అందరి ముందే మాట్లాడడం తిలక్ వర్మ చేసిన పెద్ద తప్పిదం అంటూ ఫైర్ అయ్యాడు. ఇది కెప్టెన్ కు ఉండాల్సిన లక్షణం కాదంటూ ఆగ్రహించాడు. ఇలాంటి వాళ్లు కెప్టెన్సీకి పనికిరారని అజంక్య రహానే (Ajinkya Rahane ) పరువు తీశాడు.
పాకిస్తాన్ జూనియర్ జట్టు చేతిలో ఓడిపోయిన తర్వాత తిలక్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం కరెక్ట్ కాదని అజింక్య రహానే ఆగ్రహించాడు. బంతులన్నీ తిలక్ వర్మ మింగేసి.. తప్పు షాబాద్ అహ్మద్ పై నెట్టేసాడని మండిపడ్డాడు. షాబాద్ అహ్మద్ 100కు పైగా స్ట్రైక్ రేట్ మైంటైన్ చేస్తే.. తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ కేవలం 67 మాత్రమే ఉందని హేళన చేశాడు. చేజింగ్ ప్రారంభంలో తిలక్ వర్మ ఎక్కువ బంతులు మింగేసాడని.. దాని వల్ల చివరలో ఇతర ప్లేయర్లపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది అంటూ వ్యాఖ్యానించాడు.
తప్పంతా తిలక్ వర్మ చేసి.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా తోటి ఆటగాళ్లపై బురద జల్లాడని ఆగ్రహించాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న షాబాద్ అహ్మద్ ను విలన్ చేసే ప్రయత్నం చేశాడని మండిపడ్డాడు. అతను సరిగ్గా ఆడకపోయి ఉంటే డ్రెస్సింగ్ రూమ్ లో క్లాస్ పీకాల్సిందని వ్యాఖ్యానించాడు. అంతేకానీ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడడం కరెక్ట్ కాదన్నాడు. దీంతో తిలక్ వర్మపై అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.