Basit Ali On IND VS PAK: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (India A vs Pakistan A, 8th Match) మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఇందులో సూపర్ విక్టరీ అందుకున్న పాకిస్తాన్.. నేరుగా సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ (Basit Ali) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా పై మ్యాచ్ గెలవగానే పాకిస్తాన్ ప్లేయర్లు తెగ సంబరపడిపోతున్నారని..ఈ సంబరం ఎక్కువ రోజులు ఉండదని బాంబు పేల్చాడు.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా మళ్లీ టీమిండియాతో పాకిస్తాన్ తల పడాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కచ్చితంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్స్ జరిగేలా బ్రాడ్ కాస్టర్లు కూడా ఫిక్సింగ్ చేస్తారంటూ ఆరోపణలు చేశాడు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితేనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు ఆదాయం వస్తుందని తెలిపాడు. ఆ దిశగా అందరూ కలిసి కుట్రలు చేయడం గ్యారెంటీ అని బాసిత్ అలీ తెలిపాడు. దీంతో బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) గ్రూప్ దశలో టీమిండియాపై గెలిచిన పాకిస్తాన్ కు మళ్లీ ఫైనల్ రూపంలో అగ్ని పరీక్ష ఎదురు కావడం గ్యారెంటీ అని బాసిత్ అలీ వెల్లడించాడు. ఫైనల్ సందర్భంగా టీమిండియాతో మళ్ళీ కచ్చితంగా ఫైట్ ఉంటుందని తెలిపాడు. రేపు యూఏఈ పై గెలిచి సెమీ ఫైనల్ కు టీమిండియా చేరుతుందని.. ఆ తర్వాత ఫైనల్ దాకా వస్తుందని తెలిపాడు.
టీమిండియా (Team India) ఫైనల్ కు వచ్చేలా బ్రాడ్ కాస్టర్లు, ఏసీసీ (ACC) పెద్దలు కుట్రలు చేస్తారని కూడా ఆరోపణలు చేశాడు. అండర్-19 ఆసియా కప్ సందర్భంగా గ్రూప్ స్టేజిలో టీమిండియా ఇలాగే ఓడిపోయిందని.. ఆ తర్వాత ఫైనల్ కు వచ్చి టైటిల్ ఎగురేసుకు వెళ్లిందని గుర్తు చేశాడు. సేమ్ ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించాడు. టీమిండియాను లైట్ తీసుకుంటే కచ్చితంగా ఫైనల్స్ లో టైటిల్ ఎగరేసుకు వెళ్తుందని వార్నింగ్ ఇచ్చాడు. గ్రూప్ స్టేజ్ లో ఎలా ఓడించారో.. ఫైనల్స్ సందర్భంగా టీమిండియాను ఓడించాలని సూచనలు చేశాడు.