Tanveer Ahmed On IND VS PAK: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) నేపథ్యంలో ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జూనియర్ జట్టుపై సూపర్ విక్టరీ అందుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ విజయంపై ఇవాళ ఉదయం నుంచి పాకిస్తాన్ మాజీలు కూడా రియాక్ట్ అవుతూ టీమ్ ఇండియాలో కించపరుస్తూ మాట్లాడుతున్నారు.
లేటెస్ట్ గా దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జూనియర్ జట్టును ఓడించేందుకు అడుగడుగునా కుట్ర జరిగిందని బాంబు పేల్చాడు. టాస్ నుంచి మొదలుకొని చివరి బంతి వరకు కుట్రలు చేశారని టీమిండియాను గెలిపించేందుకు బీసీసీఐతో పాటు అంపైర్లు కూడా కుట్రలు పడినట్టు ఆరోపించాడు. మ్యాచ్ కంటే ముందే, బీసీసీఐ ఇచ్చిన డబ్బులకు మ్యాచ్ రిఫరీలు అమ్ముడుపోయారంటూ హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.