BigTV English

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ కు నో ఛాన్స్.. బీసీసీఐని బజారుకు ఈడ్చిన అంబటి రాయుడు !

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ కు నో ఛాన్స్.. బీసీసీఐని బజారుకు ఈడ్చిన అంబటి రాయుడు !

Shreyas Iyer: ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన టీమ్ ఇండియా జట్టులో శ్రేయస్ అయ్యర్ కి చోటు దక్కని విషయం తెలిసిందే. దీంతో శ్రేయస్ అయ్యర్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. బీసీసీఐ సెలెక్టర్లపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారత జట్టుకు కెప్టెన్ కావాల్సిన అయ్యర్ ని అనవసరపు రాజకీయాలతో తొక్కేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ టోర్నీకి సెలక్ట్ కాలేదని తెలిసిన అనంతరం శ్రేయస్ అయ్యర్ జిమ్ లో కనిపించాడు. ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తూ కనిపించాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు కొనసాగుతున్నారు.


Also Read: Kohli’s son: కోహ్లీ కొడుకు పుట్టిన గడియపై రచ్చ.. RCB ప్లేయర్ల జట్లే ఛాంపియన్స్ 

టి-20 ప్రపంచ కప్ 2024 లో భారత్ ని ఛాంపియన్ గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టి-20 ఫార్మాట్ కి వీడ్కోలు పలకగా.. సూర్య కుమార్ యాదవ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. టి-20 జట్టు కెప్టెన్ గా రేసులో ముందున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని మేనేజ్మెంట్ సూర్య కుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. ఇక తాజాగా ఇంగ్లాండ్ పర్యటనకు ముందే రోహిత్ శర్మ టెస్ట్ లకు కూడా గుడ్ బై చెప్పేశాడు. దీంతో యంగ్ ప్లేయర్ గిల్ టీమ్ ఇండియా టెస్ట్ ఫార్మాట్ కి కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు.


అయితే వన్డేలకు మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్ నిర్ణయం తర్వాత టి-20 లలో సూర్య కుమార్ యాదవ్ వరుస విజయాలతో అతడికి సరైన వారసుడు అనిపించుకోగా.. గిల్ కూడా కెప్టెన్ గా తన మొదటి ప్రయాణంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఇక రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ 2027 వరకు కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వన్డేల్లో రోహిత్ శర్మ వారసుడి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. “2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా కి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించాలి. మన లక్ష్యం వరల్డ్ కప్ సాధించడమే. ఆ సత్తా రోహిత్ శర్మ లో ఉంది. రెండు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. కానీ భారత్ కి వరల్డ్ కప్ ను సాధించి పెట్టే సామర్థ్యం ఎవరిలో ఉందో చూడాలి. ఒకవేళ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటే వరల్డ్ కప్ ని మనం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిత్ అప్పటివరకు తన ఫిట్నెస్ ని కాపాడుకోవాల్సి ఉంటుంది. వన్డేల్లో రోహిత్ శర్మ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.

Also Read: Ashwin: శ్రేయాస్ అయ్యర్, జైస్వాల్ కారణంగానే ముంబైలో వరదలు… అశ్విన్ సంచలనం

కానీ రోహిత్ శర్మ తర్వాత వన్డే జట్టుకు కెప్టెన్ అయ్యే అర్హత శ్రేయస్ అయ్యర్ కే ఉంది. అద్భుతమైన నైపుణ్యాలతో గత సంవత్సరం ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ {KKR} జట్టును ఛాంపియన్ గా నిలిపాడు అయ్యర్. అలాగే ఈ ఏడాది యంగ్ ప్లేయర్స్ తో కూడిన పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ కీ చేర్చాడు. అతడు ఓ అసాధారణ నైపుణ్యాలు ఉన్న కెప్టెన్. త్వరలోనే అతడు టీమిండియా కెప్టెన్ గా నియమితుడు కావాలి” అని శుభంకర్ మిశ్రా ఛానల్ లో పేర్కొన్నాడు అంబటి రాయుడు. కాగా త్వరలో టి-20, వన్డే జట్లకు కూడా గిల్ కెప్టెన్ కాబోతున్నాడనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో.. అంబటి రాయుడు మాత్రం భిన్నంగా స్పందిస్తూ శ్రేయస్ అయ్యర్ పేరును ప్రస్తావించడం విశేషం.

Related News

Big update on Team India : రోహిత్ శర్మ, సూర్య కుమార్ కు కొత్త గండం…బీసీసీఐ యాక్షన్ ప్లాన్ ఇదే!

Shreyas Iyer : ఫ్యాన్స్ దెబ్బకు దిగివచ్చిన BCCI.. శ్రేయాస్ అయ్యర్ కు కీలక పదవి… ఏకంగా కెప్టెన్సీనే

Asia Cup 2025 : టీమిండియాను గాడిలో పెట్టేందుకు భీమవరం కుర్రాడు.. బీసీసీఐ అదిరిపోయే ప్లాన్

SRH: ఫ్యాన్స్ కు షాక్.. SRH నుంచి ఇద్దరు ప్లేయర్లు ఔట్.. కాటేరమ్మ కొడుకు కూడా !

Abhishek Sharma: SRHలో మిస్ అయింది… ఆసియా కప్ లో 300 కొడతాం… అభిషేక్ వార్నింగ్ !

Big Stories

×