Shreyas Iyer : టీమిండియా వన్డే కెప్టెన్ గా ప్రస్తుతం సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయిన తరువాత తదుపరి కెప్టెన్ గా టీమిండియా కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ నియమితులు కానున్నట్టు సమాచారం. అయితే ఇటీవలే ఆసియా కప్ 2025 కి సంబంధించి టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో శ్రేయస్ అయ్యర్ ని తుది జట్టులో సెలెక్ట్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి చేర్చడం.. కోల్ కతా నైట్ రైడర్స్ కి 2024లో టైటిల్ అందించిన ఘనత శ్రేయస్ అయ్యర్ కి దక్కింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ 2025 కి శ్రేయస్ అయ్యర్ ని సెలెక్ట్ చేయకపోవడంతో అంతా ఆశర్యపోయారు. దీంతో తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
Also Read : SRH: ఫ్యాన్స్ కు షాక్.. SRH నుంచి ఇద్దరు ప్లేయర్లు ఔట్.. కాటేరమ్మ కొడుకు కూడా !
వన్డే కెప్టెన్ గా శ్రేయస్..?
రోహిత్ శర్మ తరువాత శ్రేయస్ అయ్యర్ టీమిండియా వన్డే కెప్టెన్ గా కొనసాగించనున్నట్టు బీసీసీఐ భావిస్తోందని.. అభిషేక్ త్రిపాఠి, దైనిక్ జాగరన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ కి టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉంటాడా..? శ్రేయర్ అయ్యర్ కొనసాగుతాడా..? చర్చలు జరుగుతున్నాయి. రోహిత్ శర్మ అభిమానులు రోహిత్ అంటే.. శ్రేయస్ అభిమానులు శ్రేయస్ పేరు చెప్పడం గమనార్హం. మొత్తానికి బీసీసీఐ అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరీ. ఇప్పుడు మనం ఏం అనుకున్నా.. కానీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తోంది బీసీసీఐ అంటూ మరికొందరూ పేర్కొంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అలాగే 2024లో కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిపాడు. 2025లో పంజాబ్ కింగ్స్ ని రన్నరప్ గా నిలిపాడు. 2025 సీజన్ లో 604 పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్.
బీసీసీఐ పై క్రికెట్ లవర్స్ ఫైర్
ఇలా ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకున్నా.. ఎన్ని రన్స్ కొట్టినా.. ఎన్ని కప్స్ కొట్టినా.. సెలెక్టర్లకు మాత్రం శ్రేయస్ అయ్యర్ మాత్రం కనిపించడు. ఆసియా కప్ టీమ్ లో శ్రేయస్ అయ్యర్ కి చోటు దక్కకపోవడం పై బీసీసీఐ పై క్రికెటర్ లవర్స్ ఫైర్ అవుతున్నారు. టీమిండియా సెలక్షన్ జరిగే సమయంలో ఏవేవో రాజకీయాలు జరుగుతున్నాయని మరికొొందరూ పేర్కొనడం గమనార్హం. 2024 రంజీ ట్రోఫీలో కూడా విజయం సాధించాడు శ్రేయస్ అయ్యర్. 2024 ఐపీఎల్, 2024 ఇరానీ ట్రోఫీ, 2025 ఐపీఎల్ రన్నరప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించాడు అయ్యర్. గౌతమ్ గంభీర్ పాలిటిక్స్ తో సర్పంచ్ సాబ్ ను తొక్కిపడేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు టీ-20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న అక్షర్ పటేల్ ను తప్పించింది బీసీసీఐ. అతని స్థానంలో శుబ్ మన్ గిల్ కి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది.
🚨 SHREYAS IYER AS ODI CAPTAIN OF INDIA 🚨
– BCCI is seeing Shreyas Iyer as the ODI Captain of Team India after Rohit Sharma. (Abhishek Tripathi/Dainik Jagran). pic.twitter.com/kfDFdL1qWB
— Tanuj (@ImTanujSingh) August 21, 2025