Dhoni Biryani Controversy: ఆహారంలో ‘ఆహా’ అనిపించే వంటకం బిర్యాని. ఇది దేశంలో ఎక్కువమంది తింటున్న ఫుడ్. ఒకరకంగా చెప్పాలంటే భాగ్యనగరం దేశానికి బిర్యానీ క్యాపిటల్ గా మారింది. ఇతర రాష్ట్రాలు, బయటి దేశాల నుండి హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దమ్ బిర్యానిని ఓ పట్టు పట్టాల్సిందే. అంత ఫేమస్ అయిన మన హైదరాబాద్ బిర్యానీకి దునియానే ఫిదా అవుతుంది. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.
మహేంద్ర సింగ్ ధోనీ నుండి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే విరాట్ కోహ్లీ వరకు హైదరాబాద్ బిర్యానీ అంటే ఫిదా అవుతారు. అయితే ఈ బిర్యానీ కోసం ఓ రోజు ధోని ఏకంగా ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే.. ఎప్పుడూ మైదానంలో కూల్ గా ఉండే ధోని బిర్యానీ కోసం ఏకంగా హోటల్ నే మార్చేశారట. ఈ సంఘటన 2014 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంలో చోటుచేసుకుంది.
2014 సెప్టెంబర్ 17న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ – కలకత్తా నైట్ రైడర్స్ తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు ముందు రోజే నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్ కి చేరుకున్నాయి. అయితే ఆ సీజన్ లో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ముంబై ఇండియన్స్ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా హోటల్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు తన ఇంట్లో వండిన బిర్యాని పంపించాలని నిర్ణయించుకున్నాడు అంబటి రాయుడు.
ఈ మేరకు బిర్యానీని ఆ హోటల్ కి పంపించాడు. కానీ బయట నుండి వచ్చిన ఆ ఫుడ్ ని హోటల్ యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీంతో బిర్యానీ విషయంలో జట్టు సభ్యులకు, హోటల్ సిబ్బందికి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మహేంద్రసింగ్ ధోని వెంటనే ఆలోచించకుండా ఆ హోటల్ ని ఖాళీ చేసి వేరొక హోటల్ కి వెళ్ళిపోయారట. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా వెల్లడించారు.
ఇక అప్పటినుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు కానీ, టీమిండియా సభ్యులు కానీ ఆ హోటల్ లో బస చేయడం లేదట. అలా గతంలో జరిగిన విషయాన్ని తాజాగా అంబటి రాయుడు వెల్లడించడంతో.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో అంబటి రాయుడు సమక్షంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడుసార్లు టైటిల్ గెలుచుకుంది. వాటిలో 2023 ఎడిషన్ కూడా ఉంది. అలా హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలకు, క్రికెటర్లకు మాత్రమే కాకుండా.. అమెరికా అగ్రనేతల వరకు బిర్యానీ అంటే ఫిదా అవుతారు. శతాబ్దాల నాటి బిర్యాని దునియాలోని రారాజుగా నిలుస్తూ వస్తుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">