Arasavalli Temple: శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వరుసగా 2వ రోజు ఆదిత్యుడ్ని సూర్యకిరణాలు తాకలేదు. దీంతో భక్తులను నిరాశ చెందారు. వాతావరణం అనుకూలించక ఆలయంలో మూల విరాట్టును సూర్యకిరణాలు స్పృశించలేదు..ప్రతీ ఏటా ఉత్తరాయణంలో మార్చి 9,10, దక్షిణాయనంలో అక్టోబర్ 1,2 తేదీ లలో స్వామివారి మూలవిరాట్టును సూర్య కిరణాలు తాకుతూ ఉంటాయాయి. నేడు కిరణ స్పర్శను చూడడానికి భారీగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. మబ్బులు, పొగమంచు కారణంగా మూలవిరాట్టును కిరణాలు తాకలేదు. తిరిగి దక్షిణాయణంలోనే ఆలయంలోని స్వామివారి మూల విరాట్టును కిరణాలు తాకే అవకాశం ఉంది.
కాగా ఆదివారం కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో భక్తులందరూ నిరాశ చెందారు. ఆదివారం సెలవు దినం కావడంతో.. సూర్య కిరణాలు స్వామివారిని తాకుతాయని భావించి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 6 గంటలకే సూర్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అయితే భక్తులు సూర్య కిరణాల కోసం వేచి చూసినప్పటికీ, వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా కిరణ స్పర్శ జరగలేదు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని, ఇంద్ర పుష్కరణిలో స్నానాలు ఆచరించి, రావిచెట్టుకు పూజలు చేశారు. కొందరు భక్తులు సూర్యనారాయణుడికి క్షీరాన్నం వండి నైవేధ్యంగా సమర్పించారు. ఆదివారం ఒక్కరోజే ఆలయానికి రూ.8,54,950 హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
శ్రీ సూర్యనారాణ స్వామి దేవస్థానం. శ్రీకాకుళానికి ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉత్తరాంధ్రాలో ఇది ప్రసిద్ధి చెందిన దేవాలయం. మనదేశంలో గల సూర్య దేవాలయాల్లో ప్రాచీనమైంది. పద్మ పురాణం ప్రకారం, ప్రజల క్షేమం కోసం కశ్యపామహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్యపూజలు జరుగుతున్న ఆలయం అరసవెల్లి. ఈ ఆలయంలో భాస్కరుడ్ని పూజించిన వారికి అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళతారు కాబట్టి ఈ ఊరిని హరషవెల్లి అనే వారని.. అదే క్రమేణా అరసవెల్లిగా మారిందని ప్రతీతి.
ఈ ఆలయంలోని గర్భగుడిలో ఉన్నటువంటి మూలవిరాట్‌ని సాక్ష్యాత్తు ఆ సూర్య భగవానుడు తాకడం ఆ దేవాలయం ప్రత్యేకత. అరసవెల్లి దేవస్థానం ప్రాంగాణం అనివెట్టిమండపం, ద్వజస్థంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలికిరణాలు గర్భగుడిలోకి మూలవిరాట్ ఆదిత్యుని శిరస్సును స్ప్రశిస్తాయి. ఆదిత్యునికి సూర్యకిరణాలు తాకినవైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. ఇక్కడ స్వామివారు ఎప్పుడు మనకు అలంకార రూపంలో దర్శనమిస్తారు.
Also Read: పూజ సమయంలో దీపం కింద ధాన్యాలను ఎందుకు వెయ్యాలి..?
మామూలు రోజులతో పోలిస్తే.. మాఘ, వైశాఖ, కార్తీకమాసాల ఆదివారాల్లో ఈ దేవాలయనికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులోను ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికి తెలిసిందే. రథస్పతిరోజు స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. సూర్యభగవానుడి ఆలయంలోని చేసే సూర్యనమస్కారానికి ఏ విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఈ ఆలయంలో సూర్యనమస్కారాలకు ఒకమండపం ఉంటుంది. ఎవరైనా సరై ఆనారోగ్యంతో బాధపడేవాళ్లు ఆ మండపంలో సూర్య నమస్కారాల వ్రతాన్ని ఆచరిస్తే.. అనారోగ్యం పోయి ఆరోగ్యం ప్రాప్తిస్తుందని చెబుతుంటారు.