E-Paper
Advertisement

Anil Kumble : కుంబ్లే టిప్స్.. పాటించిన స్టోక్స్..

Anil Kumble : కుంబ్లే టిప్స్.. పాటించిన స్టోక్స్..
Advertisement
Anil Kumble

Anil Kumble : భారత గడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలిటెస్ట్ లో టీమ్ ఇండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అలాగే టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు భారత స్పినర్ల ధాటికి 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ధాటిగా ఆడింది. తొలి రోజు యశస్వి జైస్వాల్ ను అడ్డుకోవడం వారి వల్ల కాలేదు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ ఇంగ్లాండ్ ఒక తప్పు చేసిందని తెలిపాడు.

స్పిన్ బౌలింగ్ చేయగల జోరూట్‌‌తో బౌలింగ్ వేయించలేదని, ఎంతసేపు ఉన్నవారితోనే బౌలింగ్ చేయించిందని అన్నాడు. కనీసం యశస్వి జైస్వాల్‌ను కట్టడి చేసేందుకైనా.. జోరూట్‌తో బౌలింగ్ చేయించాల్సిందన్నాడు. తను మంచి యాక్షన్‌తో బౌలింగ్ చేస్తాడని తెలిపాడు. మరి కెప్టెన్ ఎందుకు తనని విస్మరించాడో అర్థం కాలేదని అన్నాడు.

Advertisement

ఇదే వికెట్‌పై అశ్విన్ లెఫ్టాండర్ బ్యాటర్స్ ను ఇబ్బంది పెట్టాడు. ఇంగ్లండ్ స్పిన్నర్లలో ఆ వ్యూహం లోపించిందని అన్నాడు. ఆత్మవిశ్వాసం‌తో పాటు నిలకడ కూడా లోపించిందని అన్నాడు. వారి ఆత్మవిశ్వాసాన్ని యశస్వి దెబ్బ కొట్టాడని అన్నాడు.

అనిల్ కుంబ్లే మాటలను కెప్టెన్ బెన్ స్టోక్స్ విన్నట్టున్నాడు. అందుకని యశస్విని అవుట్ చేసేందుకు జో రూట్ ని రెండోరోజు ఉదయమే రంగంలోకి దించాడు. ఆట మొదలైన కాసేపటికే యశస్వి రూట్ బౌలింగ్‌లో తనకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓవర్ నైట్ స్కోర్ 76 పరుగులకి మరో 4 పరుగులు మాత్రమే జోడించి 80 దగ్గర జోరూట్ కి దొరికిపోయాడు.

Advertisement

ఇలా అవుట్ కాగానే, అలా నెట్టింట అనిల్ కుంబ్లేపై దాడి మొదలు పెట్టారు. ‘ఇంటి గుట్టు చెప్పి లంకకే చేటు తెచ్చావు కదరా విభీషణా’.. అని రావణాసురుడి కోట్స్ పెడుతున్నారు.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×