Rashid Khan VS Liam Livingstone Fight: ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ ( The Hundred Men’s Competition 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. గత నాలుగు రోజుల కిందట ప్రారంభమైన ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 13 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. అయితే, ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏరి కోరి కొనుగోలు చేసిన రూ.13 కోట్ల ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ ను ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ బెదిరించాడు. పరుగు తీస్తున్న లియామ్ లివింగ్‌స్టోన్ ను (Liam Livingstone) గెలికి మరీ.. తన్నించుకున్నాడు రషీద్ ఖాన్ (Rashid Khan). ఈ సంఘటన ఎమ్ఐ లండన్ వర్సెస్ లండన్ స్పిరిట్ (MI London vs London Spirit, 12th Match) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది. దీంతో ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే, కావ్య పాపపై ఉన్న కోపంతో, లియామ్ లివింగ్‌స్టోన్ ను రషీద్ ఖాన్ బెదిరించాడని ట్రోల్స్ చేస్తున్నారు.
ది 100 లీగ్ 2026 టోర్నమెంటులో భాగంగా ఎమ్ఐ లండన్ వర్సెస్ లండన్ స్పిరిట్ జట్ల మధ్య 12వ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన లండన్ స్పిరిట్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో లండన్ స్పిరిట్స్ జట్టు చేజింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లండన్ స్పిరిట్ జట్టు కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) పరుగు తీయకుండా రషీద్ ఖాన్ అడ్డుకున్నాడు. అంతకంటే ముందు బంతి రషీద్ వేయగా… దాన్ని బౌండరీకి పంపాడు లిలియామ్ లివింగ్‌స్టోన్. అయితే దాన్ని మనసులో పెట్టుకున్న రషీద్ ఖాన్, లివింగ్ స్టోన్ పరుగు తీస్తుండగా అడ్డు తగిలాడు. అయినా సహనంతో ఉన్న లియాం లివింగ్ స్టోన్ ను మళ్లీ గెలికాడు రషీద్ ఖాన్. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగి తన్నుకునేదాకా వెళ్ళింది. అంతలోనే అంపైర్ కలుగజేసుకొని వివాదానికి చెక్ పెట్టారు. అయితే ఆ తర్వాత మరో ఎండ్ వైపు ఉన్న జేమ్స్ ను కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు రషీద్ ఖాన్.
లియామ్ లివింగ్‌స్టోన్ ను రషీద్ ఖాన్ గెలికినందుకు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో తమ జట్టు తరఫున ఆడే లియామ్ లివింగ్‌స్టోన్ తో అస్సలు పెట్టుకోకని వార్నింగ్ ఇస్తున్నారు. అసలే 13 కోట్ల ప్లేయర్ అని.. వాడికి ఏమైనా అయితే, కావ్య కు తీవ్ర నష్టమని పేర్కొంటున్నారు. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !
Liam Livingstone Brutally Owned Rashid Khan pic.twitter.com/mAB5iYLBaQ
— Aryan Goel 2.0 (@AryanGoelNew) July 30, 2026