BigTV English

Arshdeep Singh : స్వింగ్ కింగ్.. అర్షదీప్ ‘సింగ్’

Arshdeep Singh : స్వింగ్ కింగ్.. అర్షదీప్ ‘సింగ్’

Swing King Arshdeep Singh : టీ 20 ప్రపంచకప్ లో అర్షదీప్ తన స్వింగ్ తో అద్భుతమే చేశాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టాపార్డర్ ను కుప్పకూల్చాడు. టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అర్షదీప్ ఇలాంటి ప్రదర్శన చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఐపీఎల్ లో తన ప్రదర్శన అంత గొప్పగా లేదు. ఈ నేపథ్యంలో టీ 20 ప్రపంచకప్ లో ఎలా ఆడతాడోనని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ నేడు తను కూడా ఒక గేమ్ ఛేంజర్ గా మారాడు.


అమెరికాలో పిచ్ లు నిజంగా బౌలర్లకు స్వర్గధామంలా ఉన్నాయి. అందుకే తనలోని నిజమైన బౌలర్ ని అర్షదీప్ బయటకు తీసుకొచ్చాడు. కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసి టీ 20 ప్రపంచకప్ లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాడు. ఇండియా తరఫున నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో నిప్పులు చెరిగే బంతులు వేసి..ప్రత్యర్థులను వణికించాడు. తను 4 ఓవర్లు వేసి.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

Also Read : సూపర్ 8 కి టీమిండియా : గెలిపించిన అర్షదీప్, సూర్యకుమార్


రికార్డు పరంగా తన తర్వాత వరుసలో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. తను కూడా 4 వికెట్లు తీశాడు కానీ 11 పరుగులు ఇచ్చాడు. హర్భజన్ సింగ్ 4 వికెట్లు తీసి 12 పరుగులు ఇచ్చాడు. ఆర్పీ సింగ్ 4 వికెట్లు తీసి 13 పరుగులు ఇచ్చాడు. ప్రపంచం మొత్తమ్మీద చూస్తే టీ 20 ప్రపంచకప్ లో గొప్ప బౌలింగ్ ప్రదర్శన చేసినవారిలో తను 18వ స్థానంలో ఉన్నాడు. తనకన్నా ముందు 6 వికెట్లు , 5 వికెట్లు తీసిన వారున్నారు. అలాగే 4 వికెట్ల పరంగా చూస్తే తనకన్నా పైన ఐదుగురు ఉన్నారు. వారందరు 4 ఓవర్లకన్నా తక్కువ ఓవర్లలో వికెట్లు తీశారు.

నిజాయితీగా చెప్పాలంటే ఇందులో 80శాతం రికార్డులన్నీ చిన్నజట్లపై వచ్చినవే కావడం విశేషం. కానీ ఇప్పుడు అర్షదీప్ మాత్రం పాకిస్తాన్ ను ఓడించి, ఒక దశలో ఇండియాను వణికించిన అమెరికాపై సాధించాడు. నిజానికి తన బౌలింగ్ వల్ల అమెరికా ఒక 20 పరుగులు ఎక్కువగా చేయలేకపోయింది. లేదంటే ఖచ్చితంగా భారత్ ఓడి, తర్వాత సూపర్ 8 కోసం కెనడాపై గెలుపు కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇప్పుడు అర్షదీప్ ఎంపిక పట్ల బీసీసీఐ దూరదృష్టిని అందరూ కొనియాడుతున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×