E-Paper
Advertisement

Arshdeep Singh : నా వల్లనే మ్యాచ్ ఓడిపోతుందని బాధపడ్డా: అర్షదీప్

Arshdeep Singh : నా వల్లనే మ్యాచ్ ఓడిపోతుందని బాధపడ్డా: అర్షదీప్
Advertisement
Arshdeep Singh

Arshdeep Singh : ఆస్ట్రేలియా-ఇండియా మధ్య ఆఖరి టీ 20 మ్యాచ్ బెంగళూరులో జరిగింది. అయితే చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ వేసేటప్పుడు అర్షదీప్ అనుభవించిన మానసిక వేదన వివరించాడు.

కెప్టెన్ సూర్య ఏమనుకున్నాడో తెలీదు. ఆఖరి ఓవర్ నా చేతుల్లో పెట్టాడు. 6 బాల్స్ లో 10 రన్స్ చేయాలి. ఆశ్చర్యపోయాను. అటువైపు చూస్తే కొరకొరా మింగేస్తూ కెప్టెన్ వేడ్ చూస్తున్నాడు. ఆ క్షణం  నా వల్లనే మ్యాచ్ ఓడిపోతుందని చాలా బాధపడ్డానని అన్నాడు. కాకపోతే సీనియర్లతో కలిసి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఇక్కడ పనిచేసిందని తెలిపాడు.

Advertisement

అప్పటికే మూడు ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చాను. ఇలాంటి సమయంలో కెప్టెన్ సూర్య నాపై ఉంచిన నమ్మకం, ఇచ్చిన ధైర్యాన్ని మరువలేను. నిజాయితీగా చెప్పాలంటే  నా మదిలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేవు. సూర్య భాయ్ నాకు ఒక్కటే చెప్పాడు. ఏదైనా జరగని నిర్భయంగా బౌలింగ్ చేయమని సూచించాడు.

ఈ విజయం క్రెడిట్ మా బ్యాటర్లదేనని తెలిపాడు. బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న పిచ్‌పై పోరాడే లక్ష్యాన్ని అందించారని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ లు చిరకాలం గుర్తుండిపోతాయని అన్నాడు. ఓడినా, గెలిచినా అభిమానులు గుర్తు పెట్టుకుంటారని అన్నాడు. అది ప్రమాదం, ప్రమోదం కూడానని అన్నాడు.

Advertisement

ఆఖరి ఓవర్ వేసేటప్పుడు మాత్రం చాలా భయపడ్డానని అన్నాడు.  కానీ ఆ దేవుడు కెప్టెన్ సూర్య రూపంలో మరో అవకాశం ఇచ్చాడని భావించానని చెప్పాడు. ఆత్మవిశ్వాసంతో చివరి ఓవర్‌ను బౌలింగ్ చేశాను. 10 పరుగులు డిఫెండ్ చేసేలా శక్తినిచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు అని తెలిపాడు.

ఇక ఆ క్షణం నాకు తెలిసిన, నేను నేర్చుకున్న బౌలింగ్ నంతా ప్రతి బాల్ లో ఉపయోగించి, నేను మనసులో ఎలా వేయాలని అనుకున్నానో అలాగే పిచ్ పై ల్యాండ్ అయ్యేలా వేశానని అన్నాడు. అంత ఒత్తిడిలో ఆడి, మ్యాచ్ ని గెలిపించడం మరిచిపోలేనని అన్నాడు. చిరస్మరణీయమైన విజయాన్ని అందించడం జీవితంలో మరిచిపోలేనని అన్నాడు.

ఈ సిరీస్ లో నా ప్రదర్శన ఆశించిన మేర లేదు. ఆఖరి ఓవర్ ఎలా వేశానో, అన్నీ అలాగే వేయాలి. నాలో ఆ శక్తి ఉందని, నాకు ఆఖరి ఓవర్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపాడు. దీంతో నా బౌలింగ్ లో లోపాలు సరిదిద్దుకొని మళ్లీ కమ్ బ్యాక్ అవుతానని అన్నాడు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×