BigTV English

China Virus : చైనా న్యుమోనియా.. విటమిన్-ఏ లోపం కారణమా?

China Virus : చైనా న్యుమోనియా.. విటమిన్-ఏ లోపం కారణమా?
China Virus

China Virus : నాలుగేళ్ల క్రితం కరోనా వైరస్.. ఇప్పుడు అంతుబట్టని అనారోగ్యం! రెండింటికీ పుట్టిల్లు చైనా. తొలుత అక్కడ శ్వాస‌కోశ వ్యాధులు చిన్నగా ఆరంభమై.. ప్రపంచమంతటా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ మహమ్మారి ఎంత అల్లకల్లోలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉత్తర చైనాలో విజృంభిస్తున్న న్యుమోనియా కేసులు అంతే ఆందోళన కలిగిస్తున్నాయి.


మిస్టరీగా మారిన శ్వాసకోశ వ్యాధితో ముఖ్యంగా చిన్నారులు విలవిలలాడుతున్నారు. చైనాలోనే కాకుండా.. ఈ తరహా కేసులు ఆసియా, అమెరికా, ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాల్లోనూ ప్రబలాయి. పిల్లలే కాదు.. పెద్దలు కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అలా బాధపడుతూ వస్తున్న వారితో ఇప్పడు ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.

దీంతో ఆ కేసులకు సంబంధించి పూర్తి వివరాలు పంపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆయా దేశాలను కోరింది. బాధితుల్లో 3-8 ఏళ్ల లోపు పిల్లలే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజా వార్తల మేరకు 14 ఏళ్ల లోపు పిల్లలు కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని తేలింది. ఇటీవల అమెరికాలోని ఒహాయోలో 150 మంది న్యుమోనియా బారిన పడ్డారు. వారంతా పిల్లలే కావడం గమనార్హం. అయితే ఇప్పుడు అమెరికాలోని అన్ని ఆస్పత్రుల్లో ఈ తరహా కేసుల సంఖ్య పెరుగుతోంది.


యూరప్‌లోనూ అంతే. కొత్త రకం న్యుమోనియా కేసులు తమ దగ్గరా పెరిగాయని నెదర్లాండ్స్, డెన్మార్క్ దేశాలు తెలిపాయి. నవంబర్ రెండో వారంలో ప్రతి లక్ష మంది చిన్నారుల్లో 103 మంది శ్వాసకోశ వ్యాధి బారిన పడ్డారు. అంతకుముందు వారంతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య 25% అధికం. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం వ్యాప్తిలో వ్యాధిని మైకోప్లాస్మా న్యుమోనియా గా గుర్తించారు. వైట్ లంగ్ సిండ్రోమ్ అని కూడా దీనిని వ్యవహరిస్తారు. యాంటీ బయోటిక్ మందులకు ఇది ఓ పట్టాన లొంగదు. వ్యాధి నిరోధకత సన్నగిల్లినందున ఈ కొత్త రకం వ్యాధి విజృంభిస్తోందనన్న మరో వాదన కూడా ఉంది. 2020, 2021లో కొవిడ్ లాక్‌డౌన్ల నేపథ్యంలో చాలా మందిలో ఇమ్యూనిటీ లెవల్స్ బాగా తగ్గాయి. ఫలితంగా మరిన్ని ఇన్పెక్షన్లు మనపై దాడి చేస్తున్నాయని కొందరు శాస్త్రవేత్తలు సూత్రీకరిస్తున్నారు.

చైనాలో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ప్రబలడానికి విటమిన్-ఏ లోపం కూడా కారణం కావొచ్చని ఇంగ్లండ్‌కు చెందిన వైద్యుడు జాన్ కాంప్‌బెల్ చెప్పారు. పాశ్చాత్య దేశాల్లోని పిల్లల్లో విటమిన్-ఏ లోపం అధికంగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. కొత్త ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొనడంలో విటమిన్-ఏ ఎంతో కీలకమని వివరించారు.

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×